నేను ఆరోగ్యంగా ఉన్నా.. నాకెందుకు పరీక్షలు..?

ABN , First Publish Date - 2022-01-11T17:26:08+05:30 IST

‘నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా.. నాకెందుకు పరీక్షలు.. కొవిడ్‌ పేరుతో ఆసుపత్రికి పంపించాలని చూస్తున్నారా..?’ అని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మండిపడ్డారు. నీటికోసం పాదయాత్ర చేపట్టిన తొలిరోజు

నేను ఆరోగ్యంగా ఉన్నా.. నాకెందుకు పరీక్షలు..?

- Covid పేరుతో ఆసుపత్రికి పంపాలని యత్నం: కేపీసీసీ అధ్యక్షుడు 

- రెండోరోజు ఉత్సాహంగా సాగిన పాదయాత్ర 


బెంగళూరు: ‘నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా.. నాకెందుకు పరీక్షలు.. కొవిడ్‌ పేరుతో ఆసుపత్రికి పంపించాలని చూస్తున్నారా..?’ అని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మండిపడ్డారు. నీటికోసం పాదయాత్ర  చేపట్టిన తొలిరోజు ఆదివారం రాత్రి కొవిడ్‌ టెస్టు చేయాలన్న వైద్యుల సూచనకు ఆయన ససేమిరా అన్నారు. సోమవారం ఉదయం సాతనూరు దొడ్డఆలహళ్లిలో పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర కొనసాగించరాదని నోటీసులు ఇచ్చారన్నారు. అదిచట్టబద్ధం కాదని, 144వ సెక్షన్‌ను ఏ విధంగా అమలు చేయాలనేది సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసిందన్నారు. పాదయాత్రను ఆపేందుకు ఇటువంటి నిబంధనలు తీసుకొచ్చారన్నారు. పాదయాత్రకు వచ్చేవారి ఓటరు గుర్తింపుకార్డు ఇస్తామని, వీడియోలు పంపుతామని చర్యలు తీసుకోవచ్చునన్నారు. తాను కూర్చున్నా, లేచినా, నిద్రపోయినా బీజేపీ వారు విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా, మరోసారి తీహార్‌ జైలుకు పంపాలనుకున్నా తన పాదయాత్రను ఆపలేరన్నారు. ఆదివారం రాత్రి తనకు కొవిడ్‌ టెస్టు చేయాలని సూచించారని, విదేశాల నుంచి విమానాలలో వచ్చినవారికి సక్రమంగా చేస్తే చాలన్నారు. కొవిడ్‌ టెస్టు చేసి పాజిటివ్‌గా ప్రకటించి ఆసుపత్రికి పంపాలని చూశారన్నారు. తాను ఫిట్‌నె్‌సతో ఉన్నానని, 15 రోజులు నడిచేందుకు సిద్ధమని సవాల్‌ విసిరారు. రెండోరోజు సాతనూరు ప్రాంతం మా దప్పనదొడ్డి దాకా యాత్ర సాగింది. కనకపుర మరలేగవి మఠాధిపతి డాక్టర్‌ ముమ్మడి శివరుద్రస్వామిజీ ఆశీస్సులు పొందారు. యాత్ర ముగింపు సమయంలో మరోసారి డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర తమ హక్కు అని, భంగం చేయాలనుకుంటే నిరాశే మిగులుతుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు పక్కనే కూర్చున్నారని, వారికి పాజిటివ్‌ లేదా అంటూ మండిపడ్డారు. సాతనూరులో 31 మందిపై కేసు వేశారని, వేలాదిమంది పాల్గొంటే కేవలం 31 మందిపైనే కేసులా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అందరికీ ఒకే న్యాయం ఉండాలన్నారు. 

Updated Date - 2022-01-11T17:26:08+05:30 IST