లాక్‌డౌన్‌ విధించినా పాదయాత్ర ఆగదు

ABN , First Publish Date - 2022-01-04T17:34:02+05:30 IST

లాక్‌డౌన్‌ విధించినా మేకెదాటు పాదయాత్ర ఆగదని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారికి సోమవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన

లాక్‌డౌన్‌ విధించినా పాదయాత్ర ఆగదు

- మేకెదాటు పాదయాత్రకు విఘ్నాలు రాకూడదని చాముండి అమ్మవారిని ప్రార్థించా 

- కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌


బెంగళూరు: లాక్‌డౌన్‌ విధించినా మేకెదాటు పాదయాత్ర ఆగదని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారికి సోమవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేకెదాటు పాదయాత్రకు ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడాలని చాముండేశ్వరి అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. మేకెదాటు పాదయాత్ర రాజకీయ ప్రయోజనాల కోసం కాదని ఈ విషయంలో బీజేపీ, జేడీఎస్‌ చేస్తున్న వాఖ్యలు అర్థరహితమన్నారు. గతంలో మాజీ ప్రధాని దేవెగౌడ కూడా పాదయాత్ర చేశారని, యడియూరప్ప కూడా పలుమార్లు పాదయాత్రలు చేశారని వాటిని తామెప్పుడూ రాజకీయం చేయలేదని డీకే గుర్తుచేశారు. కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నందున పాదయాత్రను వాయిదా వేసుకోవాలని సీఎం చేసిన సూచనపై స్పందించిన ఆయన కొవిడ్‌ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ పాదయాత్రను నిర్వహిస్తామని, ఒకవేళ లాక్‌డౌన్‌ విధించినా పాదయాత్ర ఆగదన్నారు. కావేరి ప్రాంతంలో రైతుల ప్రయోజనాల పరిరక్షణకోసమే పాదయాత్రను చేపట్టామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యూహాత్మకంగా ఒత్తిడి తీసుకురావడమే పాదయాత్ర ప్రధాన ఉద్దేశ్యమన్నారు.

Updated Date - 2022-01-04T17:34:02+05:30 IST