బెంగళూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆశీస్సులతో తాను ముఖ్యమంత్రి(Chief Minister) కావడం ఖాయమని, తనను ఎవరూ అడ్డుకోలేరని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Sivakumar) పేర్కొన్నారు. శుక్రవారం ఓ కన్నడ చానల్‌తో ఆయన మాట్లాడుతూ తనకు పదవి దక్కడం రాసిపెట్టి ఉంటే ఎలా మార్పు చేస్తారన్నారు. రాజకీయం అనేది నిలిచిన నీరు కాదని, ఏమైనా జరగవచ్చునని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని, రాజకీయంగా తనను ఇబ్బందులు కలిగించే కుట్ర జరుగుతోందన్నారు. పార్టీ కోసం రెండేళ్లుగా నిద్రమాని సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. తనకూ అవకాశం ఇస్తే ప్రజాసేవ చేస్తానన్నారు. తీహార్ జైల్లో ఉన్నప్పుడు సోనియాగాంధీ(Sonia Gandhi) పరామర్శించారని, గంటన్నరపాటు మాట్లాడారని, సోనియా అభిమానంపై నమ్మకం ఉందన్నారు. తనకు సీఎం పదవి దక్కాలని ఉంటే ఎవరూ తప్పించలేరన్నారు. కానీ తన ఆప్తులు పడుతున్న వేధింపులు శత్రువుకు కూడా రాకూడదన్నారు. సిద్దరామోత్సవతో తనకు షాక్ లేదన్నారు. సిద్దరామోత్సవ ద్వారా సిద్దరామయ్యతోపాటు కాంగ్రెస్ పార్టీకి శక్తి పెరిగిందన్నారు.
ఇవి కూడా చదవండి