Congress సహకారం లేకుండా కేంద్రంలో అధికారం కల్ల

ABN , First Publish Date - 2021-12-04T18:51:14+05:30 IST

కాంగ్రెస్‌ సహకారం లేకుండా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. చిక్కమగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగాల్‌, ఢిల్లీకే

Congress సహకారం లేకుండా కేంద్రంలో అధికారం కల్ల

            - కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ 


బెంగళూరు: కాంగ్రెస్‌ సహకారం లేకుండా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. చిక్కమగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగాల్‌, ఢిల్లీకే పరిమితమైన టీఎంసీ, ఆప్‌ పార్టీలు అతిగా ఊహించుకుంటున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు బ్రేక్‌ వేసేందుకు ప్రతిపక్షాలు తమ సిద్ధాంతాల వైరుధ్యాన్ని పక్కనపెట్టి ఏకంకావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 300 సీట్లు అసాధ్యమంటూ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, పార్టీకి దీంతో సంబంధం లేదన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక గాలులు బలంగా వీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నారన్నారు. సీఏఏ వంటి చట్టాలను మైనార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వీటిని కూడా ఉపసంహరించుకుని బీజేపి తన చిత్తశుద్దిని చాటుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో డిసెంబరు 10న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. 

Updated Date - 2021-12-04T18:51:14+05:30 IST