త్యాగాల చరిత్ర మాది... మోసాల చరిత్ర వారిది

ABN , First Publish Date - 2021-12-29T18:00:47+05:30 IST

దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ కాగా మోసాలతో దగా చేస్తున్న చరిత్ర బీజేపీదని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ సంస్థాపనా దినోత్సవాన్ని మండ్య జిల్లా మద్దూరులోని

త్యాగాల చరిత్ర మాది... మోసాల చరిత్ర వారిది

                             - కాంగ్రెస్‌ సంస్థాపనా దినోత్సవంలో డీకే శివకుమార్‌ 


బెంగళూరు: దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ కాగా మోసాలతో దగా చేస్తున్న చరిత్ర బీజేపీదని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ సంస్థాపనా దినోత్సవాన్ని మండ్య జిల్లా మద్దూరులోని శివపురలో మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న ప్రసంగిస్తూ కేంద్రంలో మోదీ ఐదేళ్ల పాలన దేశ ప్రజలలో ఆశలు రేకెత్తించి రెండోసారి పాలనలో చుక్కలు చూపిస్తోందని చురకలంటించారు. కాంగ్రెస్‌ చరిత్రకు, బీజేపీ చరిత్రకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. తాను విద్యార్థి నేతగా ఉన్న సమయంలో బీజేపీ లేదన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌, జనసంఘ్‌ ఉండేవన్నారు. స్వాతంత్య్ర పోరాటాలలో దేశం కోసం అన్నిమతాలకు చెందిన నేతలు ప్రాణాలర్పించగా అప్పుడు బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇప్పుడు బీజేపీ నోట దేశభక్తి ప్రవచనాలు ఆశ్చర్యం రేకెత్తిస్తున్నాయన్నారు. ప్రజలు వీటిని ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్నారు. కొవిడ్‌వేళ ప్రజలు దేశవ్యాప్తంగా పడ్డ కష్టాలు చెప్పనలవి కాదన్నారు. దేశ రాజ్యాంగాన్ని బలోపేతం చేసి సామరస్యాన్ని పెంపొందించి యువతలో, మహిళల్లో దీనదళితుల్లో భరోసా నింపిన ఘనత కాంగ్రె్‌సదేనన్నారు. దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల మధ్య విద్వేషా లు నాటుతున్నది ఎవరో అందరికీ తెలిసిందేనన్నారు. ఎక్కువకాలం ప్రజలను మభ్యపెట్టలేరన్నారు. కాంగ్రెస్‌ సభ్యత్వ న మోదు కార్యక్రమాన్ని లభిస్తున్న స్పందన తనను పులకింపచేస్తోందన్నారు. కేపీసీసీ కార్యాధ్యక్షులు సలీం అహ్మద్‌, రామలింగారెడ్డి, ధృవనారాయణతోపాటు మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలు హాజరయ్యారు. 

Updated Date - 2021-12-29T18:00:47+05:30 IST