DK Sivakumar: చరిత్రను చెరిపేయలేరు

ABN , First Publish Date - 2022-08-16T18:13:18+05:30 IST

భారత సంగ్రామంలో కాంగ్రెస్‌ పాత్ర మహత్తరమైనదని, ఇందుకు ఆధారమైన చరిత్రను ఎవరూ చెరిపేయలేరని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(KPCC

DK Sivakumar: చరిత్రను చెరిపేయలేరు

- భారత సంగ్రామంలో కాంగ్రెస్‌ పాత్ర మహత్తరమైనది 

- కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ 


బెంగళూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): భారత సంగ్రామంలో కాంగ్రెస్‌ పాత్ర మహత్తరమైనదని, ఇందుకు ఆధారమైన చరిత్రను ఎవరూ చెరిపేయలేరని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(KPCC President DK Sivakumar) పేర్కొన్నారు. బసవనగుడి నేషనల్‌ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన భారీ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దావణగెరె ర్యాలీ అనంతరం బెంగళూరు ర్యాలీ విజయవంతం కావడంపై కాంగ్రెస్‏పై ప్రజల్లో విశ్వాసం రేకెత్తిస్తున్నాయన్నారు. రాజధాని నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఆరు దశాబ్దాలకు పైగా ప్రజలందరినీ కాంగ్రెస్‌ నడిపించి అభివృద్ధి పథంలో సాగిందన్నారు. గత 8 ఏళ్ల బీజేపీ పాలనలో అసహనం, మతోన్మాదం అలుముకుంటున్నాయని, ఇందుకు కేంద్రంలో ఉన్న పాలకులే సమాధానం చెప్పాలని నిలదీశారు. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్‌ త్యాగాలు చేసిందని, అప్పట్లో జాతీయ పతాకాన్ని, రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన సంస్థలు ప్రస్తుతం బీజేపీకి బాసటగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Siddaramaiah) మాట్లాడుతూ రాష్ట్రంలో భారతస్వాతంత్య్ర పోరాటంలో ప్రజలంతా కలసికట్టుగా పోరాడారని, దురదృష్టవశాత్తు ప్రస్తుత పాలకులు మతం పేరుతో విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు. అంతకుముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‏సింగ్‌ సుర్జేవాలా ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ర్యాలీలో విధానపరిషత్‌ ప్రతిపక్షనేత బీకే హరిప్రసాద్‌, మాజీ సీఎం వీరప్పమొయిలీ, మాజీ డీసీఎం డాక్టర్‌ జీ పరమేశ్వర్‌, ప్రచార సమితి అధ్యక్షుడు ఎంబీ పాటిల్‌, కేపీసీసీ కార్యాధ్యక్షులు సలీం అహ్మద్‌, ఈశ్వర్‌ ఖండ్రే, ధ్రువ నారాయణ, రామలింగారెడ్డి(Ramalinga Reddy), సతీశ్‌జార్కిహొళి, మాజీ మంత్రి హెచ్‌కే పాటిల్‌, ఆర్‌వీ దేశ్‌పాండే, దినేశ్‌ గుండూరావు, ఉమాశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T18:13:18+05:30 IST