మంత్రి హరీశ్ రావుపై డీకే అరుణ ఫైర్

ABN , First Publish Date - 2020-11-01T04:36:40+05:30 IST

మంత్రి హరీశ్‌రావు‌పై మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు..

మంత్రి హరీశ్ రావుపై డీకే అరుణ ఫైర్

దుబ్బాక: మంత్రి హరీశ్‌రావు‌పై మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా దుబ్బాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె బీజేపీని జూటా పార్టీ అనడం హరీశ్‌రావుకు తగదన్నారు. డబ్బుతో ఓట్లను కొనాలని టీఆర్‌ఎస్‌ ప్లాన్ చేసిందని చెప్పారు. రైతులను తన వైపు తిప్పుకోవడానికి కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, సిద్దిపేట, దుబ్బాక రెండు కళ్లని ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మోసాలు.. అబద్దాలు టీఆర్‌ఎస్‌కే సాధ్యమని డీకే అరుణ తెలిపారు. 


Updated Date - 2020-11-01T04:36:40+05:30 IST