Dizo: ఇండియాలో లాంచ్ అయిన డిజో వైర్‌లెస్ యాక్టివ్ నెక్‌‌బ్యాండ్, వాచ్ డిషార్ప్.. ఫీచర్లు అదుర్స్!

ABN , First Publish Date - 2022-07-20T01:32:07+05:30 IST

రియల్‌మి టెక్‌లైఫ్ ఎకోసిస్టం నుంచి వస్తున్న తొలి బ్రాండ్ డిజో (DIZO) రెండు సరికొత్త ఉత్పత్తులను భారత్‌లో

Dizo: ఇండియాలో లాంచ్ అయిన డిజో వైర్‌లెస్ యాక్టివ్ నెక్‌‌బ్యాండ్, వాచ్ డిషార్ప్.. ఫీచర్లు అదుర్స్!

న్యూఢిల్లీ: రియల్‌మి టెక్‌లైఫ్ ఎకోసిస్టం నుంచి వస్తున్న తొలి బ్రాండ్ డిజో (DIZO) రెండు సరికొత్త ఉత్పత్తులను భారత్‌లో నేడు (మంగళవారం) లాంచ్ చేసింది.  ఇందులో ఒకటి డిజో వైర్‌లెస్ యాక్టివ్ నెక్‌బ్యాండ్(Dizo Wireless Active Neckband) కాగా, మరోటి డిజో వాచ్ డి షార్ప్(DIZOWatchDsharp). ఇవి రెండు వరుసగా ఈ నెల 28, 29 నుంచి వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. డిజో వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌లో 23 గంటలపాటు ఏకధాటిగా పాటలు వినొచ్చు. 10 నిమిషాల చార్జింగ్‌తో మూడు గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. అలాగే, ఇతర ఫీచర్లతోపాటు డెడికేటెడ్ గేమింగ్ మోడ్ కూడా ఉంది. స్మార్ట్‌వాచ్ డి షార్ప్‌లో 1.75 అంగుళాల డిస్‌ప్లే, వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి.


 డిజో వైరల్‌లెస్ యాక్టివ్ నెక్‌బ్యాండ్, వాచ్ డి షార్ప్ ధరలు ఇలా

డిజో వైరల్‌లెస్ యాక్టివ్ నెక్‌బ్యాండ్ ధర రూ. 1, 499. పరిచయ ఆఫర్ కింద ఇప్పుడు దీనిని రూ. 1,199కే సొంత చేసుకోవచ్చు. క్లాసిక్ బ్లాక్, ఇండిగో బ్లూ, మేటియర్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. డిజో వాచ్ డి షార్ప్ ధర రూ. 3,499 కాగా, పరిచయ ఆఫర్ కింద రూ. 2,999కే అందుబాటులో ఉంది. ఇందులో క్లాసిక్ బ్లాక్, డీప్ బ్లూ, సిల్వర్ గ్రే రంగుల ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండింటిని ఫ్లిప్‌కార్ట్(Flipkart) ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. నెక్‌బ్యాండ్‌ను జులై 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి,  డి షార్ప్ వాచ్‌ను జులై 29న మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. 


డిజో వైర్‌లెస్ యాక్టివ్ నెక్‌బ్యాండ్ స్పెసిఫికేషన్లు: ఈ నెక్‌బ్యాండ్ స్ట్రాప్‌పై లేజర్‌తో చెక్కిన ఆకృతితో మొగ్గలపై డైమండ్ గ్రిడ్ ఆకృతిని కలిగి ఉంటుంది. మెరుగైన సౌండ్ అనుభవం కోసం బాస్ బూస్ట్ ప్లస్ అల్గారిథమ్‌తోపాటు 11.2 ఎంఎం పీయూ ప్లస్ పీక్ డయాఫ్రమ్ డ్రైవర్‌లు ఉన్నాయి. అలాగే, పర్యావరణ నాయిస్ క్యాన్సిలేషన్ అల్గోరిథం, సంగీతాన్ని పాజ్ చేయడానికి/ప్లే చేయడానికి, కాల్స్‌ను తిరస్కరించేందుకు, గేమ్ మోడ్‌కి మారేందుకు స్మార్ట్ కంట్రోల్స్ ఉన్నాయి. 


పవర్ ఆఫ్ చేసేందుకు బడ్‌లను క్లిప్ చేయొచ్చు. బడ్‌లను వేరుచేయడం ద్వారా కాల్స్‌కు సమాధానం ఇవ్వొచ్చు. డిజో వైర్‌లెస్ యాక్టివ్ గేమ్ మోడ్‌తో వస్తోంది.  బ్లూటూత్ v5.3కి సపోర్ట్ చేస్తుంది. బరువు 24 గ్రాములు. 150 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పది నిమిషాల చార్జింగ్‌తో మూడు గంటల ప్లే బ్యాక్ లభిస్తుంది. ఫుల్ చార్జింగ్‌తో 23 గంటలపాటు సంగీతాన్ని వినొచ్చు.  


డిజో వాచ్ డి షార్ప్ స్పెసిఫికేషన్లు: 1.75 అంగుళాల దీర్ఘచతురస్రాకార డిస్‌ప్లే. 320 x 390 పిక్సల్స్ రిజల్యూషన్. దీని గరిష్ట బ్రైట్‌నెస్ 550 నిట్స్. 150 వాచ్ ఫేసెస్‌కు సపోర్ట్ చేస్తుంది. హార్స్ రైడింగ్, హైజంప్, లాంగ్ జంప్‌, వివిధ రకాల నృత్య రూపాలు.. తాయ్ చి, మార్షల్ ఆర్ట్స్, ట్రామ్పోలిన్‌తో సహా 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే,  SpO2, స్లీప్ ట్రాకర్, మెన్‌స్ట్రువల్ పీరియడ్ ట్రాకర్, వాటర్ డ్రింక్ రిమైండర్ వంటి అనేక ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్‌లు కూడా ఉన్నాయి. వీటితోపాటు మ్యూజిక్ కంట్రోల్, ఫోన్ కెమెరా కంట్రోల్, స్మార్ట్ నోటిఫికేషన్స్, అలారం, ఫైండ్ మై ఫోన్ వంటివి కూడా ఉన్నాయి. ఈ వాచ్‌లో 300 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. వాచ్ పూర్తిగా వాటర్ రెసిస్టెన్స్. 

Updated Date - 2022-07-20T01:32:07+05:30 IST