Abn logo
Sep 20 2021 @ 23:51PM

కొప్పర్తిలో డిక్సన్‌ పరిశ్రమ

పారిశ్రామిక వాడను పరిశీలిస్తున్న డిక్సన్‌ సంస్థ ప్రతినిధులు, రాజోలి వీరారెడ్డి

వచ్చే నెలలో ప్రారంభం

పరిశ్రమల సలహాదారుడు రాజోలి వీరారెడ్డి


కడప(ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 20: కడప నగర శివారులోని కొప్పర్తిలో ఉన్న వైఎ్‌సఆర్‌ ఈఎంసీ పారిశ్రామిక వాడలో ప్రముఖ ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తి సంస్థ డిక్సన్‌ కంపెనీ వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు పరిశ్రమల సలహాదారుడు రాజోలి వీరారెడ్డి వెల్లడించారు. సోమవారం డిక్సన్‌ సంస్థ వైస్‌ప్రెసిడెంట్‌ రాజు, ఆ కంపెనీ ప్రతినిధులు జెడ్‌ఎం జోనల్‌ ఆఫీసర్‌ పద్మ కలిసి పారిశ్రామిక వాడను సందర్శించారు. కంపెనీ ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, తొలివిడతలో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని వారు అన్నారు. డిక్సన్‌ కంపెనీ వారు ల్యాప్‌టా్‌పలు, ఫోన్‌లు, ట్యాబ్‌ తదితర ఉత్పత్తులు ఇక్కడ తయారు చేయనున్నారు. వాటిని దేశంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతులు చేయనున్నారు.