వెలుగు పూల వసంతం

ABN , First Publish Date - 2020-11-14T05:57:12+05:30 IST

చీకటిలో చిరు దివ్వెలు వెలిగించుటే పండుగోయి అజ్ఞానపు అంధకారం విడుచుటనే పండుగోయి...

వెలుగు పూల వసంతం

చీకటిలో చిరు దివ్వెలు 

వెలిగించుటే పండుగోయి

అజ్ఞానపు అంధకారం

విడుచుటనే పండుగోయి


నరకాసుర సంహారం

జన జీవన సంతోషం

సత్యభామ విరోచితం

జగతి శాంతి కేతనం


అసుర గణ వధపర్వం

ప్రగతి కాంతి పతాకం

అబల కాదు ఏ వనితా

తెలుపుతోంది ఈ చరితా


చిచ్చుబుడ్లు కాకర్లు

లేకున్నా పర్లేదు

కరోనా కాలుష్యం

కరిగిపోవుటే  పండుగ


నాడు నేడు ఎప్పుడైనా

సుభిక్షమే పండుగోయి

కష్టాల చిక్కు ముళ్ల

మది తలపులు మరవండోయ్


ఇష్టాల వెలుగు కళ్ల

హృది తలుపులు తెరవండోయ్

మమతల మతాబులే

ముదముగ విరజిమ్మునోయి

తిమిరంతో సమరమే

వెలుగు పూల నిచ్చునోయి

సాంప్రదాయ సందళ్లే

వసంతమై వచ్చునోయి


-కటుకోఝ్వల రమేష్

Updated Date - 2020-11-14T05:57:12+05:30 IST