కెనడాలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు

ABN , First Publish Date - 2021-11-17T21:04:57+05:30 IST

కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలో ఉన్న డుర్హం రిజినల్ తెలుగు వారంతా దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ నెల 13న కెనడాలోని ఒషావా నగరంలో నిర్వహించిన ఈ వేడుకలకు కెనడా ఎంపీ ర్యాన్ టర్నబుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది అద్భత విజయాలను సాధించిన తెలుగు వారిని అభినందించి, షీల్డ్స్ బహుకరించారు. అంతేకాకుండా ఈ

కెనడాలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు

ఎన్నారై డెస్క్: కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలో ఉన్న డుర్హం రిజినల్ తెలుగు వారంతా దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ నెల 13న కెనడాలోని ఒషావా నగరంలో నిర్వహించిన ఈ వేడుకలకు కెనడా ఎంపీ ర్యాన్ టర్నబుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ ఏడాది అద్భత విజయాలను సాధించిన తెలుగు వారిని అభినందించి, షీల్డ్స్ బహుకరించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగు ప్రముఖలను ఆయన సత్కరించారు. భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఎంతో నేర్పించిందన్నారు. కెనడా దేశ అభివృద్ధిలో భారతీయుల కృషి ఉందని కొనియాడారు. డుర్హంలోని తెలుగు ప్రజలకు తన సహాయ సహకారాలను అందిస్తానని చెప్పారు.



ఈ క్రమంలోనే రమేష్ ఉప్పలపాటి మాట్లాడుతూ.. దీపావళి పండుగను కెనడా నేషనల్ హాలిడేగా ప్రకటించేందుకు పార్లమెంట్‌లో కృషి చేయాలని ఎంపీని కోరగా.. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై కెనడా పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డీటీసీ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రవి మేకల, గౌతమ్ పిడమర్తి, శ్రీకాంత్ సింగిశెట్టి, వెంకట్ చిలువేరి, సర్ధార్ ఖాన్, కమల మూర్తి తదితరులను ర్యాన్ ప్రశంసించారు. కాగా..  టొరెంటో తెలుగు టైమ్స్ సంపాదకులు గౌ. సర్దార్ ఖాన్ ఈ కార్యక్రంలో పాల్గొని తెలుగు సభను ద్విగ్విజయంగా ముగించారు. ఇదిలా ఉంటే.. ఈ వేడుకల్లో 550 మంది సభ్యులు పాల్గొన్నారు. పలు క్రీడా, ఆటల, సాహిత్య కార్యక్రమాలతో పటాసులు వెలిగించి, షడ్రసోపేతమయిన తెలుగు వంటకాలు ఆరగించారు.  




Updated Date - 2021-11-17T21:04:57+05:30 IST