Jun 27 2021 @ 10:28AM

అవకాశాల కోసం ఎదురు చూస్తున్న దివ్యాన్ష కౌశిక్..!

'మజిలీ' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన్‌ దివ్యాన్ష కౌశిక్ కొత్త  అవకాశాల కోసం ఎదురు చూస్తుందట. శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య - సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమాలో దివ్యాన్ష కౌశిక్ ఓ హీరోయిన్‌గా నటించింది. ఫస్టాఫ్‌లో కనిపించిన ఈమె బాగానే ఆకట్టుకుంది. అయితే బలమైన సన్నివేశాలు..కథ సమంత చుట్టూ తిరగడంతో అంతగా క్రేజ్ రాలేదు. దాంతో తన డెబ్యూస్ సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా తర్వాత అవకాశాలు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కరోనా వల్ల కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఏవీ అనౌన్స్ కాకపోవడంతో గ్యాప్ బాగానే వచ్చింది. ఎట్టకేలకి ఇటీవల మాస్ మహారాజ రవితేజ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. దాంతో మళ్ళీ కాస్త వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ కథలను వినే పనిలో ఉందట. మరో మంచి ప్రాజెక్ట్‌లో అవకాశం వస్తే ఒకే చేయాలని ఎదురు చూస్తుందట. చూడాలి మరి మళ్ళీ ఇప్పుడుప్పుడే తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్‌కి మరో సినిమాలో అవకాశం దక్కుతందేమో.