డివిజన్ల పునర్విభజన సక్రమంగా లేకుంటే కోర్టుకెళ్తాం

ABN , First Publish Date - 2021-04-13T05:18:42+05:30 IST

రాజమహేంద్రవరంలో 10 గ్రామాల విలీనం ప్రక్రియలో డివిజన్ల పునర్వివిభజన సక్రమంగా లేకపోతే కోర్టుకు వెళ్తామని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు.

డివిజన్ల పునర్విభజన సక్రమంగా లేకుంటే కోర్టుకెళ్తాం

  • ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వామపక్ష పార్టీలు
  • మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు 

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 12: రాజమహేంద్రవరంలో 10 గ్రామాల విలీనం ప్రక్రియలో డివిజన్ల పునర్వివిభజన సక్రమంగా లేకపోతే కోర్టుకు వెళ్తామని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక హోటల్‌ జగదీశ్వ రిలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్ల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. 52 డివిజన్లు అనుకున్నప్పుడు అన్ని డివిజన్లలోను ఓటరు సంఖ్య సమానంగా వుండాలని కొన్ని డివిజన్లకు 8వేలు మరికొ న్నింటికి 10వేలు నుంచి 15వేలు చూపించడం సరికాదన్నారు. దీనిపై ఇప్పటికే సీపీ ఎం తదితర వామపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. రాజమహేంద్రవరంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గణన జరగాలి ఆయన చెప్పారు. ఈ నెల 15వ తేదీలోగా కమిషనర్‌ను కలిసి వివరిస్తామన్నారు. ఎంపీ భరత్‌ నగరంలో జరిగిన జ్యోతిరావు పూలే జయంతిలో పెద్దపెద్ద మాటలు మాట్లాడారని, ఈ రెండేళ్లలో ఆయన నగరానికి ఏమి చేశారని ఆదిరెడ్డి ప్రశ్నించారు. తాను నగరంలో బీసీ వసతి గృహాలకు రూ5.84 కోట్లు నిధులు మంజూరు చేయించి టెండర్లు పిలిచే సమయానికి ఎన్నికల కోడ్‌ వచ్చి పనులు ఆగిపోయాయని, బీసీ బాలికలు, బాలుర వసతి గృహానికి అదనపు గదులు నిర్మించేందుకు తెచ్చిన నిధులు వెనక్కిపోయాయని చెప్పారు. సమావేశంలో టీడీపీ నగర అడహక్‌ కమిటీ కన్వీనర్‌ రెడ్డి మణి, సభ్యుడు ఇన్నమూరి దీపు, నాయకులు దాస్యం ప్రసాద్‌, చాపల చిన్నరాజు, టీడీపీ పార్లమెంట్‌ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:18:42+05:30 IST