ఉమ్మడి జిల్లా అటవీశాఖ విభజన

ABN , First Publish Date - 2022-08-07T05:17:00+05:30 IST

ఉమ్మడి జిల్లాలో అటవీశాఖ విభజనను ఎట్టకేలకు పూర్తి చేశారు. అన్ని విభాగాల విభజన పూర్తయినప్పటికీ అటవీశాఖ విభజన జరగలేదు.

ఉమ్మడి జిల్లా అటవీశాఖ విభజన

 అనంతకు 74,462, శ్రీసత్యసాయి జిల్లాకి 1,24,468 హెక్టార్లు.. 

  హెక్టార్లు మార్పు జరిగే అవకాశం ఉందన్న డీఎ్‌ఫఓ

అనంతపురం న్యూటౌన, ఆగస్టు 6: ఉమ్మడి జిల్లాలో అటవీశాఖ విభజనను ఎట్టకేలకు పూర్తి చేశారు. అన్ని విభాగాల  విభజన పూర్తయినప్పటికీ అటవీశాఖ విభజన జరగలేదు. ఇప్పటి వరకు ఉమ్మడిగానే అనంతపురం డీఎ్‌ఫఓ సందీప్‌ కృపాకర్‌ విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. శుక్రవారం రాత్రి విభజనకు సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం నుంచి రావడంతో అందుకు అనుగుణంగా జిల్లా అటవీశాఖ కార్యాలయంలో చర్యలు ప్రారం భం అయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి జిల్లా అటవీశాఖ విస్తీర్ణంలో అనంతపురం జిల్లాకు 74,462 హెక్టార్లు కేటాయించారు.  శ్రీసత్యసాయి జిల్లాకు 1,24,468 హెక్టార్లు కేటాయించారు.   ఉమ్మడి జిల్లాలో ఆరు రేంజ్‌లున్నాయి. అనంతపురం, కళ్యాణదుర్గం, గుత్తి రేంజ్‌లు అనంతపురం జిల్లాలోకి వచ్చాయి. ఇక పెనుకొండ, బుక్కపట్నం, కదిరి రేంజ్‌లు శ్రీసత్యసాయి జిల్లాలోకి చేరాయి.


Updated Date - 2022-08-07T05:17:00+05:30 IST