దైవ ద్రోహులను దండించాల్సిందే: చినజీయర్‌

ABN , First Publish Date - 2020-10-01T09:13:11+05:30 IST

‘దేవాలయాలపై దాడులు చేయడమంటే... దైవం పట్ల తప్పు చేసినట్టే. అలాంటి వారిని గుర్తించి దండించాల్సిందే’ అని త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి అన్నారు...

దైవ ద్రోహులను దండించాల్సిందే: చినజీయర్‌

సింహాచలం, సెప్టెంబరు 30: ‘దేవాలయాలపై దాడులు చేయడమంటే... దైవం పట్ల తప్పు చేసినట్టే. అలాంటి వారిని గుర్తించి దండించాల్సిందే’ అని త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి అన్నారు. అహోబిల జీయర్‌స్వామితో కలిసి బుధవారం ఆయన సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. తిరుమల డిక్లరేషన్‌ వివాదంపై చినజీయర్‌స్వామి స్పందిస్తూ.. ‘దైవాన్ని విశ్వాసంతో దర్శించుకునేందుకు వచ్చిన వారెవరినైనా అనుమతించాల్సిందే. ఆ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సిందే’ అని అన్నారు. బాబ్రీకేసులో తీర్పు ఆహ్వానించదగ్గదని, ఇదెప్పుడో రావలసిందని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-10-01T09:13:11+05:30 IST