గుంపులుగానూ విడిపోయారు!

ABN , First Publish Date - 2021-05-03T06:16:25+05:30 IST

‘‘సాహిత్యంలోనూ గదులేనా?’’ అంటూ పి. రామకృష్ణ సుతిమెత్తగా, ఆచీ తూచీ తమ ఆవేదన వెలిబుచ్చారు (ఏప్రిల్‌ 19, 2021-వివిధ). ఈ వాదంలోని మంచి సెబ్బరల గురించి....

గుంపులుగానూ విడిపోయారు!

‘‘సాహిత్యంలోనూ గదులేనా?’’ అంటూ పి. రామకృష్ణ సుతిమెత్తగా, ఆచీ తూచీ తమ ఆవేదన వెలిబుచ్చారు (ఏప్రిల్‌ 19, 2021-వివిధ). ఈ వాదంలోని మంచి సెబ్బరల గురించి చర్చ జరగడం లేదని అన్నారు. ఆయన మాటలు వింటే సున్నితమైన మనస్సు కలవాళ్లకు ఎంత గడ్డుకాలం వచ్చిందా అన్న మనో వ్యధ కలుగుతుంది. దళిత, స్త్రీ, ముస్లిం (మైనారిటి) వాద రచయితలు రచయిత్రులు ఈ వాదంలోని మంచి చెడ్డల గురించి లోగడ చర్చలూ, సెమినార్లూ, శిక్షణ శిబిరాలు నిర్వహిం చారు. పి. రామకృష్ణకు ఈ సంగతి తెలిసినట్లు లేదు. దళిత, స్త్రీవాద, మైనారిటీ వాద రచయిత్రులూ, రచయితలూ వీటిలో పాల్గొన్నా, వాళ్లలో వున్న భిన్నా భిప్రాయాలే ఎక్కువగా బయటపడ్డాయిగాని, ఏకాభి ప్రాయాలు వ్యక్తమైంది తక్కువ. ఫలితం ఏమంటే ఈ వాదులు ప్రాంతీయత, కుల ఉప కులాల ఆధారంగానూ, సిద్ధాంతాల పరంగానూ వేరు కుంపట్లు పెట్టుకొని రచనా వ్యాసంగం సాగిస్తున్నారు. దళిత, స్త్రీవాద, మైనారిటీ రచయితల్లో, రచయిత్రుల్లో రెండేసి గుంపులున్న సంగతి అందరికీ తెలిసిందే. అన్నింటిలోనూ ఆంధ్ర, తెలంగాణా రచయితల సంఘాలు వేరేగా వున్నాయి. ముఖ్యంగా మన తెలుగు రచయితలు, రచయిత్రులు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ప్రసాదించే పురస్కారాల కోసం ఎంత ఎగబడు తున్నారని! అబ్బో! అదో పెద్ద గ్రంథం!!


నిబద్ధ రచయితగా నాలుగు దశాబ్దాలకు పైగా కథలు, నవలా, విమర్శనలూ చిత్తశుద్ధితో రాసిన పి. రామకృష్ణ ఇప్పటి రచయితల, రచయిత్రుల నిబద్ధత, నిమగ్నతల గురించి తల్చుకోకుండా ఉంటే ప్రశాంత జీవనం గడుప గలుగుతారు. 

ఘట్టమరాజు

99640 82076


Updated Date - 2021-05-03T06:16:25+05:30 IST