మండలి బుద్ధప్రసాద్
అవనిగడ్డ టౌన్, జనవరి 28 : తరచూ ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రజలకు తక్షణం సహాయం అందేలా అవనిగడ్డ కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ జె.నివాస్‌కు లేఖ రాశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవటంతో ఇక్కడి వారికి తక్షణ సాయం అందటం లేదని, రెవె న్యూ డివిజన్ ఏర్పాటు ద్వారా వారికి మెరుగైన సాయం వెంటనే అందుతుందన్నారు. పూర్వ దివితాలూకాలోని మండలాలైన అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, మొవ్వ మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవనాలు, కోర్టులు, సబ్ జైలు, పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాలన్నీ అందుబాటులో ఉన్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని బుద్ధప్రసాద్ కోరారు.