Abn logo
Sep 26 2021 @ 00:43AM

రైళ్ల దారి మళ్లింపు

గుంతకల్లు, సెప్టెంబరు 25: గుత్తి సమీపంలోని రామరాజుపల్లె వద్ద రైల్వే నాన ఇంటర్లాకింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు-హిందూపురం-గుంతకల్లు (నెం.07693/94) ప్యాంసింజరు రైళ్లను రెండురోజులపాటు దారి మళ్లించినట్లు అధికారులు శనివారం తె లిపారు. గుంతకల్లు-హిందూపురం ప్యాసింజరును శ నివారం గుత్తి మీదుగా కాకుండా గూళ్యపాళ్యం-కల్లూరు సెక్షన మీదుగా పంపినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణపు రైలును కూడా ఆదివారం ఇదే సెక్షన మీదుగా పంపనున్నట్లు తెలియజేశారు. సోమవారం నుంచి ఈ రైళ్లు యథా ప్రకారంగా గుత్తి మీదుగా వె ళ్తాయన్నారు.