రైళ్ల దారి మళ్లింపు

ABN , First Publish Date - 2022-08-13T05:19:49+05:30 IST

గుంతకల్లు రైల్వే డివిజన్‌ అనంతపురం జిల్లా తాటిచె ర్ల-జంగాళ్లపల్లె మార్గంలో జరుగుతున్న రైల్వే లైను డబ్లింగ్‌ పనుల కారణంగా పలు రైళ్ల ను రైల్వేశాఖ దారి మళ్లించింది.

రైళ్ల దారి మళ్లింపు
రైళ్ల కోసం ములకలచెరువు రైల్వేస్టేషన్‌లో వేచి ఉన్న ప్రయాణికులు

తాటిచెర్ల-జంగాళ్లపల్లె రైల్వే లైను డబ్లింగ్‌ పనులు

ప్రయాణీకుల పడిగాపులు

ములకలచెరువు, ఆగస్టు 12: గుంతకల్లు రైల్వే డివిజన్‌ అనంతపురం జిల్లా తాటిచె ర్ల-జంగాళ్లపల్లె మార్గంలో జరుగుతున్న రైల్వే లైను డబ్లింగ్‌ పనుల కారణంగా పలు రైళ్ల ను రైల్వేశాఖ దారి మళ్లించింది. ధర్మవరం నుంచి ములకలచెరువు, బి.కొత్తకోట మండ లం తుమ్మణంగుట్ట, కురబలకోట, మదనప ల్లె రోడ్‌, వాయిల్పాడు, కలికిరి, పీలేరు మీదు గా తిరుపతికి వెళ్లే ఎనిమిది రైళ్లను దారి మళ్లించారు. కదిరిదేవరపల్లె - తిరుపతి (రై లు నెంబర్‌ 07590), తిరుపతి - కదిరిదేవ రపల్లె(07589) మధ్య రోజూ నడిచే స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ముంబై - నాగర్‌కోయిల్‌ (16339), నాగర్‌కోయిల్‌ - ముంబై (16340), అమరావతి - తిరుపతి(12766), తిరుపతి - అమరావతి(12765), సికింద్రాబాద్‌ - తిరుపతి (12770), తిరుపతి - సికింద్రాబా ద్‌ (12732) మధ్య నడిచే రైళ్లను ములకలచెరు వు మీదుగా కాకుండా గుంతకల్లు నుంచి కడప మీదుగా దారి మళ్లించారు. దీంతో ఈ మార్గంలో రోజూ మధ్యాహ్నం, రాత్రి వేళ న డిచే స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లించ డంతో ప్రస్తుతం ఈ మార్గంలో కేవలం ఒక ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ రైలు మాత్రమే నడుస్తోం ది.

ఈ రైలు ధర్మవరం నుంచి ములకలచెరు వు మీదుగా తిరుపతికి వెళ్తోంది. ఈ రైలునే తిరిగి తిరుపతి నుంచి గుంతకల్లుకు నడుపు తున్నారు. ఇలా ఈ ఒక్క రైలును మధ్యా హ్నం, రాత్రి వేళ నాలుగుసార్లు నడుపుతు న్నారు. రైళ్ల దారి మళ్లింపు విషయం తెలియ క ప్రయాణికులు ములకలచెరువు రైల్వేస్టేష న్‌లో శుక్రవారం పడిగాపులు కాశారు. ఈనె ల 19వ తేదీ వరకు డబ్లింగ్‌ పనులు జరుగు తాయని, అప్పటి వరకు రైళ్ల దారి మళ్లింపు కొనసాగుతందని రైల్వే ఉన్నతాధికారుల నుంచి ములకలచెరువు రైల్వేస్టేషన్‌కు సమా చారం అందింది. 

కిక్కిరిసిన ధర్మవరం - నర్సాపురం రైలు

 రైళ్ల దారి మళ్లింపుతో ధర్మవరం-నర్సాపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు, తిరుపతి స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మాత్రమే నడుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం ధర్మవరం నుంచి ములకలచె రువు మీదుగా నర్సాపురం వెళ్లిన ఎక్స్‌ప్రెస్‌  ప్రయాణికులతో కిక్కిరిసింది. ములకల చెరు వు స్టేషన్‌లో 500 మంది ప్రయాణికులు రైలు ఎక్కారు.  రద్దీ ఎక్కువగా ఉండడంతో కొందరు ప్రయాణికులు బస్సులను ఆశ్రయిం చారు. కాగా ఈరైలు ములకలచెరువుకు గం ట ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలు కోసం పడి గాపులు కాయాల్సి వచ్చింది. కనీసం అధికా రులైనా ప్రకటించి ఉంటే బాగుండేదని పలు వురు అభిప్రాయపడ్డారు.



Updated Date - 2022-08-13T05:19:49+05:30 IST