రెవెన్యూలో కలవరం

ABN , First Publish Date - 2022-08-14T05:25:06+05:30 IST

ఇద్దరు వీఆర్వోల సస్పెన్షన్‌.. 60 మందికి చార్జిమెమోల జారీతో రెవెన్యూశాఖలో కలవరం రేపుతోంది.

రెవెన్యూలో కలవరం


ఇద్దరు వీఆర్వోల సస్పెన్షన్‌
60 మందికి చార్జిమెమోలు

రాజాం రూరల్‌, ఆగస్టు 13:
ఇద్దరు వీఆర్వోల సస్పెన్షన్‌.. 60 మందికి చార్జిమెమోల జారీతో రెవెన్యూశాఖలో కలవరం రేపుతోంది. విధి నిర్వహణలో అలసత్వం పదర్శిస్తున్నారంటూ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ చర్యలకు దిగుతుండడంపై కిందిస్థాయిలో సిబ్బందిలో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు జిల్లాలోని 19 మండలాల పరిధిలో 60 మంది రెవెన్యూ కార్యదర్శులకు జేసీ మయూర్‌అశోక్‌ మెమోలు జారీ చేశారు. భూముల ధరలకు రెక్కలొచ్చిన నేపథ్యంలో వీఆర్వోలపై నిఘా పెట్టారు. ఇప్పటికే రాజాం మున్సిపాలిటీ పరిధిలోని ఇద్దరు వీఆర్వోలను కలెక్టర్‌ సూర్యకుమారి సస్పెండ్‌ చేశారు.మీ సేవా ద్వారా వచ్చిన మ్యుటేషన్‌ అర్జీలను నిర్దేశిత సమయంలో పరిష్కరించకపోవడం, ఫిర్యాదుదారుల పట్ల అలసత్వం ప్రదర్శించడం వంటి ఆరోపణల నేపథ్యంలో 60 మందికి జేసీ చార్జిమెమోలు జారీ చేశారు. చీపురుపల్లి మండలంలో ఏడుగురు, బొబ్బిలి మండలంలో ఆరుగురు, జామి, భోగాపురం మండలాల్లో ఐదుగురు, మెంటాడ, సంతకవిటి, గంట్యాడ, ఎల్‌.కోట మండలాల్లో నలుగురేసి చొప్పున, వంగర, గుర్ల మండలాల్లో ముగ్గురేసి, బాడంగి, రామభద్రపురం, దత్తిరాజేరు, మెరకముడిదాం మండలాల్లో ఒక్కొక్కరు వంతున మెమోలు అందుకున్న వారిలో ఉన్నారు.


Updated Date - 2022-08-14T05:25:06+05:30 IST