సైకిల్‌పై విధులకు కలెక్టర్‌..

ABN , First Publish Date - 2022-03-10T16:16:59+05:30 IST

వాహనాల కాలుష్యాన్ని అడ్డుకోవడంపై అవగాహన కల్పిస్తూ మదురై జిల్లా కలెక్టర్‌ అని్‌షశేఖర్‌ బుధవారం తన నివాసం నుంచి సైకిల్‌పై కార్యాలయానికి వచ్చారు. వాహనాల ద్వారా వెలువడే వాయువుల వలన

సైకిల్‌పై విధులకు కలెక్టర్‌..

                   - వాహన కాలుష్యంపై అవగాహన


ప్యారీస్‌(చెన్నై): వాహనాల కాలుష్యాన్ని అడ్డుకోవడంపై అవగాహన కల్పిస్తూ మదురై జిల్లా కలెక్టర్‌ అని్‌షశేఖర్‌ బుధవారం తన నివాసం నుంచి సైకిల్‌పై కార్యాలయానికి వచ్చారు. వాహనాల ద్వారా వెలువడే వాయువుల వలన వాతావరణం కాలుష్యమవుతోంది. ఇందువల్ల ఈ గాలిని పీల్చే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరిస్తున్నప్పటికీ, వాహనాల సంఖ్య మాత్రం తగ్గిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి బుధవారం సొంత వాహనాలు వదిలి, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో, మదురై జిల్లా కలెక్టర్‌ అని్‌షశేఖర్‌ ఉదయం 9 గంటలకు తన నివాసం నుంచి సైకిల్‌పై బయల్దేరి 30 నిమిషాల్లో కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్యోగులందరూ ఈ విధానం పాటించాలని కలెక్టర్‌ కోరారు.

Updated Date - 2022-03-10T16:16:59+05:30 IST