శాస్త్రీయ పద్ధతిలో జిల్లాలను విభజించాలి

ABN , First Publish Date - 2020-07-12T11:24:34+05:30 IST

జిల్లాల విభజన శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని, లేదంటే అపార నష్టం తప్పదని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పేర్కొన్నారు. శనివా రం

శాస్త్రీయ పద్ధతిలో జిల్లాలను విభజించాలి

మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ


గుజరాతీపేట: జిల్లాల విభజన శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని, లేదంటే అపార నష్టం తప్పదని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పేర్కొన్నారు. శనివా రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ ని యోజకవర్గాలను జిల్లా నుంచి వేరుచేస్తే శ్రీకాకుళం జిల్లా 80 ఏళ్ల వెనక్కి వెళ్లిపో తుందన్న ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.  దీనిపై తమ అధినేత చంద్రబాబునాయుడుతో ప్రత్యేకించి  మాట్లాడడం, లేఖ రాయడం జరిగిందన్నారు.  జిల్లా ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులుగా తమపై ఉందని అప్పలసూర్యనారాయణ తెలిపారు.  


బీసీ సంఘ నాయకుల వినతి  

ప్రతిపక్ష పార్టీ హోదాలో జిల్లా విభజనను అడ్డుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు శనివారం తెలుగుదేశం పార్టీ నేతలకు వినతిపత్రం అందజేశారు. ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ నియోజకవర్గాలను వేరే జిల్లాల్లో కలిపితే శ్రీకాకుళానికి తీరని నష్టం జరుగుతుందని వివరించారు. ఈ మేరకు  టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలను  వేర్వేరుగా కలసి వినతి పత్రాలు అందజేశారు.


అలా గే సీపీఎం ప్రధాన కార్యదర్శి భైరి కృష్ణమూర్తిని కూడా బీసీ సంఘం నేతలు కలసి వినతి పత్రం సమర్పించారు.  జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిట్టా చంద్ర పతిరావు, తదితరులు పాల్గొన్నారు.  శ్రీకాకుళం కల్చరల్‌: జిల్లా నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని వేరు చేయడం వల్ల మరింత వెనుకబాటుకు గురవుతామని సుందర సత్సంగం వ్యవస్థాపక అధ్యక్షులు పెరుంబుదూరు సూరిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎచ్చెర్లను విజయ నగరంలో కలిపితే పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు లేని జిల్లాగా శ్రీకాకుళం మారిపోతుందన్నారు.  దీనిపై రాజకీయ నేతలు, మేథావులు ఆలోచించాలన్నారు. జిల్లాను విడదీస్తే పోరాటం చేస్తామన్నారు.

Updated Date - 2020-07-12T11:24:34+05:30 IST