గుంటూరు: జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అసంబద్ధంగా ఉందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లా ఏర్పాటు తగదన్నారు. తెనాలి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వేమూరు ప్రజలకు తెనాలితో అవినాభావ సంబంధం ఉందని, తెనాలి డివిజన్‌లోని వేమూరును బాపట్లలో కలపడం సరికాదన్నారు. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు ఉండాలని చెప్పారు. రాజకీయ స్వలాభం కోసం జిల్లాల ఏర్పాటు ఉండకూడదని పేర్కొన్నారు. హేతుబద్ధత లేని జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని ఆనందబాబు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి