ఐక్య పోరాటాలతో హక్కుల సాధన

ABN , First Publish Date - 2020-08-10T10:39:29+05:30 IST

ఆదివాసీలంతా ఐక్య పోరాటాల ద్వారా హక్కులను సాధించుకోవాలని జిల్లా గిరిజన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.కృష్ణారావు అన్నారు.

ఐక్య పోరాటాలతో హక్కుల సాధన

 మెళియాపుట్టి, ఆగస్టు 9: ఆదివాసీలంతా ఐక్య పోరాటాల ద్వారా హక్కులను సాధించుకోవాలని జిల్లా గిరిజన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.కృష్ణారావు అన్నారు. ఆదివారం పెద్దమడి, గేటుపేట, రామచంద్రపురం, గిరి జన గ్రామాల్లో  ప్రంపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాలివ్వాలని కోరారు. ఐటీడీఏ కార్యాలయంలో గిరిజనులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో ఎస్‌.దేవేంద్రరావు, భాస్కరరావు, వెంకట్రావ్‌, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.


ఘనంగా ఆదివాసీ దినోత్సవం 

నందిగాం:  మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. గిరిజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో బెల్లుకోల, సొంటినూరు, చిన్నగురువురు గ్రామాల్లో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి  ఆదివాసీ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు ఎం.జగ్గారావు, ఎస్‌.షణ్ముఖ రావు, ఎన్‌.రాజారావు, బి.తిరుపతిరావు పాల్గొన్నారు.


ఆదివాసీ సంప్రదాయాలను కొనసాగించాలి

హరిపురం: సమాజానికి దూరంగా కొండకోనల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలను ప్రభుత్వాలు గౌరవించి కొనసాగించాలని ఆదివాసీ సంఘం నాయకులు సవర జగన్నాయకులు, సవర జొరాడు అన్నారు. మందస మండలం కిల్లోయి ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఆది వారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేపట్టి ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘం నాయకులు సవర చంద్రరావు, సవర జగన్‌, డొంబురు, దండాశి, విజయ్‌, ప్రసాద్‌దొళాయి, కుమారస్వామి, అప్పారావు, అబ్రహం, మల్లేసు తదితరులు పాల్గొన్నారు. 


‘ కొండనుంచి దూరమయ్యే పరిస్థితి’

పాతపట్నం: స్థానిక గిరిజన సామాజిక భవనంలో ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. సబ్‌ ట్రెజరీ అధికారి మల్లిపురం భాగ్యలక్ష్మి ఆదివాసీ పతాకావిష్కరణ చేసి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం గిరిజనాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంద న్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల నుంచి, కొండల నుంచి గిరిజనులు దూరమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సూప రింటెండెంట్‌ చిన్నమ్మడు మాట్లాడుతూ.. జీవో నెం.3ను యథాతధంగా అమ లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘ నాయకులు దాసుపురం రామారావు,  బైదలాపురం సింహాచలం, మల్లిపురం శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T10:39:29+05:30 IST