ఎంసెట్‌లో ప్రతిభ చాటిన జిల్లా విద్యార్థులు

ABN , First Publish Date - 2022-08-13T05:53:10+05:30 IST

ఇంజనీరింగ్‌, అనుబంధ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. జిల్లా విద్యా

ఎంసెట్‌లో ప్రతిభ చాటిన జిల్లా విద్యార్థులు
విద్యార్థులను అభినందిస్తున్న కరస్పాండెంట్‌ వెంకట్‌రెడ్డి

ఇంజనీరింగ్‌, అనుబంధ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది.  జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించారు. 

శ్లోకా ఐఐటీ మెడికల్‌ అకాడమీ విద్యార్థుల ప్రతిభ

సూర్యాపేట అర్బన్‌, ఆగస్టు 12: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎంసెట్‌ ఫలితాల్లో జిల్లా కేంద్రానికి చెందిన శ్లోకా ఐఐటీ-మెడికల్‌ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు కళాశాల కరస్పాండెంట్‌ మారం వెంకట్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని శ్లోకా ఐఐటీ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. ఎంసెట్‌ 2022 ఫలితాల్లో శ్లోకా ఐఐటి మెడికల్‌ అకాడమి విద్యార్థి యం. నరేందర్‌రెడ్డి 2265, ఆర్‌, కౌశిక్‌ 2897, ఎ. బద్రి 3291 ర్యాంకులు సాధించారని తెలిపారు. వీరితో పాటు ఏడుగురు విద్యార్థులు   10 వేల లోపు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ సునిత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 

కవితా, శ్రీవిద్య కళాశాలలు...

చిలుకూరు : ఎంసెట్‌ ఫలితాల్లో కవితా, శ్రీవిద్య కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కరస్పాండెంట్‌ శ్రీధర్‌, ప్రిన్సిపాల్స్‌ కెమిస్ర్టీ వెంకటేశ్వరరావు, గద్దె రఘు తెలిపారు. విద్యార్థులు బద్రీనారాయణ(3468), మహేష్‌(4,173), గాయత్రి(5648), రాజశేఖర్‌రెడ్డి(5902), సాయి రిషీత(7568), ఈశ్వర గంగా(9943), సాయితరుణ్‌(10149) ర్యాం కులు సాధించినట్లు తెలిపారు. 

సత్తా చాటిన శ్రీవిద్య విద్యార్థులు

కోదాడ:ఎంసెట్‌లో శ్రీవిద్య కళాశాల విద్యా ర్థులు ప్రతిభను చాటుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ మాదా వెంకటేశ్వరరావు తెలిపారు. కళాశాలకు చెందిన కె.బద్రినారాయణ(3468), జై.మహేష్‌(4173), జి.గాయత్రి (5,648), వై.రాజశేఖర్‌రెడ్డి(5,092), సీహెచ్‌ సాయి రిషిత(7,568), ఈశ్వర్‌రంగ(9,943) ర్యాంకు సాధించారన్నారు. విద్యార్థులు ఉత్తమర్యాంకులు సాధించటంపై కరస్పాండెంట్‌ మాదాల శ్రీధర్‌, గద్దె రఘు అభినందించారు. 

హుజూర్‌నగర్‌ విద్యార్థిని హర్షితారెడ్డి 

హుజూర్‌నగర్‌ : ఎంసెట్‌ ఫలితాల్లో హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన గుజ్జుల హర్షితారెడ్డి 1010ర్యాంకు సాధించింది. 98.57మార్కులు సాధించినట్లు తల్లిదండ్రులు గుజ్జుల శ్రీనివాసరెడ్డి-వీరమ్మ తెలిపారు. ఏపీ ఎంసెట్‌లోనూ 107.9మార్కులతో 1150 సాధించినట్లు తెలిపారు. జేఈఈ మెయిన్స్‌లో 191మార్కులతో ఆల్‌ ఇండియా 6794 ర్యాంకు సాధించిందన్నారు. 

Updated Date - 2022-08-13T05:53:10+05:30 IST