Abn logo
Sep 23 2021 @ 23:50PM

సర్పంచ్‌లు ప్రజా మన్నన పొందాలి

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు

కాళ్ళ, సెప్టెంబరు 23: సర్పంచ్‌లు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజా మన్నన పొందుతారని ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. సర్పంచ్‌ల ఛాంబర్‌ జిల్లా అధ్యక్షుడిగా ఆందపురం సర్పంచ్‌ కొలుకులూరి ధర్మరాజు ఎన్నికైన సందర్భంగా పెదఅమిరంలో గురువారం అభినందన సభ జరిగింది. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు, వైసీపీ ఉండి ఇన్‌చార్జ్‌ గోకరాజు రామరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కొలుకులూరి ధర్మరాజు, ఉపాధ్యక్షుడిగా నిడమర్రు మండలం ఎనికేపల్లి సర్పంచ్‌ పుప్పాల మోహర్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా ఇరగవరం మండల సర్పం చ్‌ ఛాంబర్‌ అధ్యక్షురాలు కులుకు హేమకుమారిని ఎంపిక చేసి అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు నిక్షపక్షపాతంగా అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచ్‌లదేనన్నారు. సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జడ్పీటీసీ పచ్చిగోళ్ళ సోమేశ్వరరావు, ఎంపీపీ పెన్మెత్స శిరీషా విశ్వనాథరాజు, కోపల్లె, కలవపూడి, కాళ్ళ సొసైటీ అధ్యక్షుడు వేగేశ్న రవిరాజు, పెన్మెత్స ప్రసాదరాజు, సుంకర భోగేశ్వరరావు, పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.