జిల్లాలో 1.96 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2021-05-16T06:39:29+05:30 IST

జిల్లాలో రబీ వరి ధాన్యం కొనుగోళ్లలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా శనివారం సాయంత్రానికి లక్షా 96 వేల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ లక్ష్మిరెడ్డి వెల్లడించారు

జిల్లాలో 1.96 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు

పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు లక్ష్మిరెడ్డి 

సామర్లకోట, మే 15: జిల్లాలో రబీ వరి ధాన్యం కొనుగోళ్లలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా శనివారం సాయంత్రానికి లక్షా 96 వేల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ లక్ష్మిరెడ్డి వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కో కేంద్రంలోను రోజుకు 10వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాత్రి 10గంటల వరకు ఽతెరిచి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. జిల్లా నుంచి కేరళ రాష్ట్రానికి బొండాలు రకం ధాన్యం ఎగుమ తులు నిర్వహించేందుకు ఆ రాష్ట్రం నుంచి ఆర్డర్లు వచ్చాయన్నారు. 


Updated Date - 2021-05-16T06:39:29+05:30 IST