మూడుముక్కలాట’ సరికాదు

ABN , First Publish Date - 2020-08-07T10:34:02+05:30 IST

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ప్రజావ్యతిరేక చర్య అని మాజీ ఎమ్మెల్యే కె. ఎ. నాయుడు అన్నారు.

మూడుముక్కలాట’ సరికాదు

 ప్రభుత్వ తీరుపై టీడీపీ ధ్వజం

సవాల్‌ను స్వీకరించని జగన్‌:  

జిల్లా అధ్యక్షుడు మహంతి


గజపతినగరం:  వైసీపీ ప్రభుత్వం తీసుకున్న  మూడు రాజధానుల నిర్ణయం ప్రజావ్యతిరేక చర్య అని  మాజీ ఎమ్మెల్యే కె. ఎ. నాయుడు అన్నారు. గురువారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పెం డింగ్‌ లో ఉన్న అయోధ్య రామాలయానికి ప్రధాని నరేంద్రమోదీ పుణ్యక్షేత్రా లనుంచి మట్టి, వంద నదులనుంచి తీసుకున్న జలాలు, వెండి ఇటుకలతో భూమి పూజ  చేశారన్నారు. అమరావతిలో అప్పట్లో ఇదేవిధంగా భూమిపూజ చేశారన్న విషయం గుర్తించాలన్నారు.


  5 కోట్ల మంది ప్రజల భవిష్యత్‌ కాలరాసేలా ఉన్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. ప్రభుత్వాలు మారినప్పడుల్లా రాజధానులు మారుస్తుంటే రాష్ట్రం అధో గతి పాలవుతుందన్నారు. 14 నెలల పాలనలో రా ష్టం అన్నిరంగాల్లో కుం టుపడిందన్నారు. చంద్రబాబు ప్రజాతీర్పు కోరాలని అధికారపార్టీకి సవాల్‌ విసిరినా స్పందించక పోవడం శోచనీయ మన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు బి. బాలాజీ, టి. ఎన్‌.యస్‌.ఎఫ్‌. జిల్లా అధ్యక్షులు వేమలి చైతన్య బాబు తదితరులు పాల్గొన్నారు. 


కొవిడ్‌ నియంత్రణలో విఫలం

విజయనగరం రూరల్‌: కరోనా సమయంలో జగన్‌ మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడటం ఎంతమాత్రం సమంజసం కాదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా మరణాలు పెరగడంతోపాటు,  ఈ కేసుల్లో రాష్ట్రం ముందువరుసలో ఉందని పేర్కొ న్నారు. మూడు రాజధానులు విషయంలో అసెంబ్లీని రద్దు చేసి, ప్రజాభి ప్రా యాన్ని కోరాలని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన సవాల్‌ను జగన్‌ స్వీకరించ లేకపోయారన్నారు. 15 నెలల వైసీపీ పాలనలో రాష్ట్ర అధోగతి పాలైందని తెలిపారు.


ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ప్రజలకు శాపా లుగా పరిణమిస్తున్నాయన్నారు. పవిత్రనదీజలాలతో మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీలో అమరావతి రాజధానికి జై కొట్టిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారన్నారు.  ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ అగ్ర నేతలు అమరావతికి అనుకూలంగా మాట్లాడి.. నేడు మూడు రాజధానులంటూ కొత్త స్వరం పలకడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వైఖరితో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. 


మాటతప్పిన జగన్‌:  మాజీ మంత్రి పడాలఅరుణ 

 రాష్ట్ర రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మాటతప్పి, మడమ తిప్పారని మాజీ మంత్రి పడాల అరుణ గురువారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.  అసెంబ్లీ సాక్షిగా రాజధానికి 30వేల ఎకరాలు అవసరమని జగన్‌ చెప్పి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మా ర్చారన్నారు.  చీకటి జీవోలతో రాష్ట్రం ఎటువైపు వెళ్తుందోతెలియని పరిస్థితి నెలకొందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.


రాజీనామాలంటే ఎందుకు భయం?

చీపురుపల్లి : రాజధాని విషయంలో తాము తీసుకున్న నిర్ణయం సరైనదే అన్న విశ్వాసం ఉన్నప్పుడు రాజీనామాలు చేయడానికి వైసీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడుతో కలసి నాయకులు, గవిడి నాగరాజు, రౌతు నారాయణరావు, ఆరతి సాహు, కలిశెట్టి సత్యనారాయణ, మండల చైతన్య తదితరులు గురువారం విలేకరులతో మాట్లాడారు. గతంలో అమరావతిని రాజధానిగా ఆమోదించిన జగన్‌ ఇప్పుడెందుకు మాట తప్పారో ప్రజలకు సమాధానం చెప్పాలని వారు కోరారు.  


అసెంబ్లీ రద్దుకు వెనుకంజ.. :భంజ్‌దేవ్‌  

సాలూరు: మూడు రాజధానుల విషయంలో  అసెంబ్లీ రద్దుకు  సిద్ధపడకుండా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మో హన్‌ రెడ్డి తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సవాల్‌ స్వీకరించకుండా వెనుకంజవేయడం శోచనీయమమని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ. భంజ్‌దేవ్‌ విమర్శించారు. ఈసం దర్భంగా స్థానిక విలేకర్లతో ఆయన ఫోన్‌లో గురువారం మాట్లాడారు. అమరా వతిని రాజధానిగానే ఉంచుతామని ఎన్నికల్లో ప్రజలను నమ్మించి ఇప్పుడు ప్రజలను మోసం చేయటం సరికాదని అన్నారు. మాట తప్పని మడమ తిప్పని జగన్‌ ఇప్పుడు చేసిందేమిటని ప్రశ్నించారు. రామ జన్మభూమి విష యంలో కేంద్రం ఏవిధమైన పరిష్కారం చేసిందో అదేవిధంగా నవ్యాంధ్రకు న్యాయం చేయాలని కోరారు.

Updated Date - 2020-08-07T10:34:02+05:30 IST