Abn logo
Sep 19 2021 @ 00:25AM

ప్లాస్టిక్‌ రహిత సమాజానికి కృషి చేయాలి : డీఈవో

విజేతలకు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తున్న డీఈవో

ప్లాస్టిక్‌ రహిత సమాజానికి కృషి చేయాలి : డీఈవో

పటమట, సెప్టెంబరు 18: ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానా అన్నారు. శనివారం అప్‌కాస్ట్‌ (ఏపీ శాస్త్ర సాంకేతిక మండలి) సౌజన్యంతో జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించారు. పోటీల్లో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మచిలీపట్నం జీవీఎన్‌ఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌కు చెందిన బి. యోగ వెంకట్‌ (9వ తరగతి) ప్రథమ స్థానంలో నిలిచారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు పటమటలంకలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో డీఈవో సుల్తానా సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏడీ కె. వేణుగోపాల్‌, సైన్స్‌ జిల్లా కో- ఆర్డినేటర్‌ మైనం హుస్సేన్‌, పాఠశాల హెచ్‌ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు.