Abn logo
May 15 2021 @ 00:18AM

జిల్లాకు 60 టన్నుల ఆక్సిజన్‌


రేపు కృష్ణపట్నం పోర్టుకు రాక


నెల్లూరు(వైద్యం), మే 14: ఈ నెల 16వ తేదీన ప్రత్యేక రైలులో 60 టన్నుల ఆక్సిజన్‌ లిక్విడ్‌ జిల్లాకు చేరనుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జామ్‌నగర్‌ స్టీల్‌ప్లాంట్‌ నుంచి రాష్ట్రానికి 110 టన్నుల ఆక్సిజన్‌ ప్రత్యేక ట్యాంకర్‌లలో రానుండగా అందులో 60 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంటుంది. అక్కడ నుంచి జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రులకు ఈ ఆక్సిజన్‌ను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ట్యాకర్లను రైలులో ఎక్కించారు. 

 

Advertisement
Advertisement
Advertisement