20 నుంచి జిల్లాస్థాయి జూడో పోటీలు

ABN , First Publish Date - 2021-10-19T05:27:13+05:30 IST

ఆరికతోట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20 నుంచి జిల్లాస్థాయి జూడో పోటీలు నిర్వహించనున్నట్లు జూడో అసోషియేషన్‌ జిల్లా కార్యదర్శి బొత్స రత్నకిషోర్‌ సోమవారం తెలిపారు.

20 నుంచి జిల్లాస్థాయి జూడో పోటీలు

రామభద్రపురం:  ఆరికతోట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20  నుంచి జిల్లాస్థాయి జూడో పోటీలు నిర్వహించనున్నట్లు  జూడో అసోషియేషన్‌ జిల్లా కార్యదర్శి బొత్స రత్నకిషోర్‌ సోమవారం తెలిపారు.  2004, 2005, 2006లో పుట్టినవారు కేడిట్‌ విభాగానికి, 2007, 2008, 2009లో పుట్టినవారు సబ్‌ జూనియర్‌ జూడో పోటీలకు అర్హులన్నారు.  జనన ధ్రువీకరణ సర్టిఫికెట్‌తో రావాలని  సూచించారు. ఇక్కడ విజేత లైన వారు 28న జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు  అర్హులని తెలిపారు.  72 గంటల ముందుగా కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు సమర్పించాలని, ఇతర వివరాలకు 9440127587 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. 


 

Updated Date - 2021-10-19T05:27:13+05:30 IST