ప్రగతి పథంలో జిల్లా

ABN , First Publish Date - 2021-01-27T05:34:02+05:30 IST

జిల్లాకేంద్రంలోని ఇందిరాగాం ధీ స్టేడియంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ శరత్‌ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకా న్ని ఆవిష్కరించారు.

ప్రగతి పథంలో జిల్లా
జెండా వందనం చేస్తున్న కలెక్టర్‌, అధికారులు

గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌

జిల్లావ్యాప్తంగా సంబురంగా రిపబ్లిక్‌ డే వేడుకలు

కామారెడ్డి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని ఇందిరాగాం ధీ స్టేడియంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ శరత్‌ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకా న్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ రంగాలలో జి ల్లా ప్రగతి పథంలో ముందంజలో ఉందన్నారు. యాసంగిలో 2 లక్షల 54 వేల 693 మంది రైతు ఖాతాల్లో రూ.255 కోట్ల 8 లక్షలను జమ చేశామన్నారు. జిల్లాలో ఒక్కో రైతుకు రూ.3487 ప్రీమియం చొప్పున  లక్ష 68 వేల 700 మంది రైతులను అర్హులుగా గుర్తించి రూ.58 కోట్ల 58 లక్షల ప్రీమియం ప్రభుత్వం చెల్లించనట్లు చెప్పారు. ఇప్పటివరకు 2246 మంది రైతులు మృతిచెందగా, వారి నామినికి బ్యాంక్‌ ఖాతాలో రూ.112 కోట్ల 30 లక్షలు జమ చేశామన్నారు. జిల్లాలో కరోనా నియం త్రణకు చేపట్టిన ప్రత్యేకచర్యలకు స్కాచ్‌ అవార్డు రావడం గర్వకారణ మని తెలిపారు. జిల్లాలో లక్షా 66,621 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 13,598 మందికి పాజిటివ్‌ వచ్చిందని, పాజిటివ్‌ రేటు 8.16 శాతం ఉందని, ఇప్పుడు 0.56 శాతం తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలోనే మన జిల్లాఅన్ని జిల్లాల కంటే తక్కువ పాజిటివ్‌ రేటు నమోదుచేసుకుందని తెలిపారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం జిల్లాలో జిల్లాకేంద్ర ఆసుపత్రితో సహా 30 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొ త్తంగా 4366 మందికి వ్యాక్సినేషన్‌ చేయగా, ప్రైవేట్‌ ఆసుపత్రుల సి బ్బందికి 848 మందిని గుర్తించినట్లు చెప్పారు. టీపాస్‌ కింద 318 పరి శ్రమలకు గాను 634 అనుమతులు పొందుటకు దరఖాస్తులు రాగా 541 అనుమతులు వివిధ శాఖల ద్వారా ఇప్పించామని తెలిపారు. అ నంతరం ఏడుగురు రైతులకు, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంపగో వర్ధన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫెదార్‌ శోభారాజు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేం దర్‌, జడ్జి సత్తయ్య, డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ వెం కటేష్‌దోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌, ఎస్పీ శ్వేతారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టుజాహ్నవి పాల్గొన్నారు.

కామారెడ్డి/కామారెడ్డి టౌన్‌: రాజకీయ పార్టీలు, విద్యా సంస్థలు,  కుల, యువజన, వ్యాపార, స్వచంద సంఘాల ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. మహనీయులకు నివాళులు అర్పించారు. కలెక్టర్‌ క్యాం పు కార్యాలయంలో కలెక్టర్‌ శరత్‌ జెండా ఆవిష్కరించారు. జడ్పీ కార్యా లయంలో జడ్పీ సీఈవో చందర్‌నాయక్‌, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్వేతా, కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ దే వేందర్‌, కామారెడ్డి జిల్లా గ్రంథాలయం వద్ద గ్రంథాలయ సంస్థ చైర్మ న్‌ సంపత్‌గౌడ్‌ జెండా ఆవిష్కరించారు. బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షురాలు అరుణతార, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సూప రిటెండెంట్‌ అజయ్‌కూమార్‌, జిల్లాకేంద్రంలోని మున్సిపల్‌ కార్యాల యం వద్ద లయన్స్‌ వివేకనంద ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. 

గాంధారి : తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ నాగరాజుగౌడ్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రాధ, మార్కెట్‌ కార్యాలయంలో చై ర్మన్‌ సత్యం జెండాను ఎగురవేశారు. నాయకులు పాల్గొన్నారు.

దోమకొండ : మండలకేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా ల్లో  జెండాను అధికారులు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. గడికో టలో కామినేని అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు ని ర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. 

రామారెడ్డి : ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో గణతంత్ర వేడు కలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరత్‌రెడ్డి, ఎంపీడీవో శంకర్‌, తహసీల్దార్‌ షర్పొద్దీన్‌ పాల్గొన్నారు.

మాచారెడ్డి : మండలంలోని ఆయా గ్రామాల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులు నృత్యాలు అలరించాయి.

భిక్కనూరు: తహసీల్‌ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ గోవర్ధన్‌, మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ గాల్‌రెడ్డి, పోలీసుస్టేషన్‌లో సీఐ యాలాద్రి, మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఎదుట చైర్మన్‌ శేఖర్‌ పతాకాన్ని ఎగురవేశారు. జడ్పీటీసీ పద్మ తదితరులు పాలొన్నారు.

లింగంపేట: తహసీల్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ నారాయణ, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రి న్సిపాల్‌ మోహన్‌రెడ్డి, పీఏసీఎస్‌లో చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి జెండాలు ఎ గుర వేశారు. కార్యక్రమాల్లో నాయకులు పాల్గొన్నారు.

తాడ్వాయి: గ్రామాల్లోని వాడవాడల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, ఎంపీపీ రవి, జడ్పీటీసీ రమాదేవి పైలకృష్ణారెడ్డి, బాపురెడ్డి పాల్గొన్నారు.

సదాశివనగర్‌ : తహసీల్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ రవీందర్‌, మండల కార్యాలయం వద్ద ఎంపీడీవో అశోక్‌, పోలీస్‌స్టేషన్‌లో సీఐ వెంకట్‌ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మహనీయుల చిత్ర ప టాలకు పూలమాలలు వేశారు.

నాగిరెడ్డిపేట: ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల వద్ద జాతీయ పతా కాన్ని ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు. తహసీల్దార్‌ సయ్యిద్‌ అహ్మద్‌ మస్రూర్‌, ఎంపీడీవో రఘు పాల్గొన్నారు.

బీర్కూర్‌ : తహసీల్‌ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ గణేష్‌, ఎం పీడీవో కార్యాలయంలో ఎంపీపీ రఘు, ఐకేపీ కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో కమల జెండాను ఆవిష్కరించారు. నాయకులు పాల్గొన్నారు. 

పిట్లం: వాడవాడలా జెండాలను ఎగురవేశారు. ఎంపీపీ కవిత, ఎస్సై రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

నస్రుల్లాబాద్‌: మండలంలోని వాడవాడలా గణతంత్ర వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్‌ ధన్వాల్‌, ఎస్సై సందీప్‌, ఎంపీపీ పాల్త్య విఠల్‌ పాల్గొన్నారు.

మద్నూర్‌: మండల కేంద్రంలోని ఆయా కార్యాలయాల్లో అధికారు లు, నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మార్కెట్‌ కమిటీ చై ర్‌పర్సన్‌ సులోచన, ఎస్సై రాఘవేందర్‌ పాల్గొన్నారు.

నిజాంసాగర్‌: ఊరూరా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. తహసీల్‌ కార్యాలయ ఆవరణలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ సత్యనా రాయణ, ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి, జవహర్‌ నవోదయ విద్యాలయ, ఆదర్శ పాఠశాల, గురుకుల పాఠశాల ల్లో ప్రిన్సిపాళ్లు జెండాను ఎగుర వేశారు. 

పెద్దకొడప్‌గల్‌: ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద జెం డాలను ఆవిష్కరించారు. ఎంపీపీ ప్రతాప్‌ రెడ్డి, సర్పంచ్‌ తిర్మల్‌ రెడ్డి, హన్మంత్‌ మాజీ ఎమ్మెల్యే గంగారాం పాల్గొన్నారు. 

జుక్కల్‌: మండలకేంద్రంలో మంగళవారం జరిగిన గణతంత్ర వేడు కల్లో శాసన సభ్యుడు హన్మంత్‌ షిండే పాల్గొన్నారు. జెండాను ఎగుర వేశారు. కార్యాలయాల వద్ద జెండాను అధికారులు ఎగురవేశారు. 

బాన్సువాడ: పట్టణంలోని టీఆర్‌ఎస్‌, ఆర్డీవో, ఏరియా ఆస్పత్రి, గాం ధీచౌక్‌, మున్సిపాలిటీ, తహసీల్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో జెండా ఆ విష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీవో రాజాగౌడ్‌, డీఎస్పీ జై పాల్‌ రెడ్డి, తహసీల్దార్‌ గంగాధర్‌, న్యాయమూర్తి వింధ్యానాయక్‌, ఏ ఎంసీ చైర్మన్‌ పాత బాలకృష్ణ పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాల యంలో మండల అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌, ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ కార్యాల యంలో కాసుల బాల్‌రాజ్‌, బీజేపీ కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు గు డుగుట్ల శ్రీనివాస్‌ జెండాను ఎగురవేశారు. 

ఎల్లారెడ్డి: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సురేందర్‌ ఎగురవేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డీవో శ్రీనునాయక్‌, మున్సి పల్‌ కార్యాలయం వద్ద చైర్మన్‌ సత్యనారాయణ, డీఎస్‌పీ కార్యాలయం వద్ద డీఎస్‌పీ శశాంక్‌రెడ్డి జెండాను ఎగురవేశారు.

బీబీపేట: గ్రామాల్లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. తహ సీల్దార్‌ నర్సింలు, ఎంపీడీవో నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:34:02+05:30 IST