అభివృద్ధి దిశగా జిల్లా ఆసుపత్రి

ABN , First Publish Date - 2022-05-20T05:41:15+05:30 IST

జిల్లాకేంద్ర ఆసుపత్రి అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే నిధులు కేటాయించిన ప్రభుత్వం, పనులు ప్రారంభించేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హోదాలో హరీ్‌షరావు తొలిసారి భువనగిరి పట్టణ పర్యటనకు శుక్రవారం రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

అభివృద్ధి దిశగా జిల్లా ఆసుపత్రి
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన డీసీపీఈ, ఎస్‌ఎన్‌సీఈ పడకలు

పలు పనులను ప్రారంభించనున్న మంత్రి హరీ్‌షరావు 

డయాగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌కు శంకుస్థాపన

చిన్న పిల్లల వార్డు ప్రారంభం

ప్రసవ శస్త్ర చికిత్సలను తగ్గించే లక్ష్యంతో సమీక్ష 


భువనగిరి టౌన్‌, మే 19: జిల్లాకేంద్ర ఆసుపత్రి అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే నిధులు కేటాయించిన ప్రభుత్వం, పనులు ప్రారంభించేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హోదాలో హరీ్‌షరావు తొలిసారి భువనగిరి పట్టణ పర్యటనకు శుక్రవారం రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బీబీనగర్‌ ఎయి మ్స్‌ సందర్శన అనంతరం ఉదయం 11.40 గంటలకు జిల్లా ఆసుపత్రికి ఆయన చేరుకోనున్నారు. జిల్లా ఆసుపత్రి లో రూ.కోటి25లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలా గే నవజాత శిశువుల (0-30 రోజులు) కోసం ఏర్పాటు చేసిన 20పడకల స్పెషల్‌ న్యూబార్న్‌ కేర్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ)ను, 20పడకల డెడికేటెడ్‌ పిడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ జనరల్‌ వార్డు (డీపీఐసీయు)ను, 12పడకల డీపీఐసీయూ యూనిట్‌ను ప్రారంభిస్తారు.వందపడకల ఆసుపత్రిగాఉన్న జిల్లా ఆసుపత్రిని పూర్తిగా పరిశీలించి ఆసుపత్రి వైద్యుల తో సమావే శం కానున్నారు. ఇందుకోసం డీఎంహెచ్‌వో డాక్టర్‌ మల్లిఖార్జున్‌రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెం ట్‌ డాక్టర్‌ చిన్నానాయక్‌ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రి పర్యటన పూర్తయ్యాక ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జిల్లాలో ప్రసవ శస్త్ర చికిత్సలను తగ్గించే లక్ష్యంతోపాటు జిల్లాలో వైద్యరంగంపై డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎ్‌స, టీవీవీపీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ గైనిక్‌ వైద్యులతో సమీక్షించనున్నారు. అలాగే పలు అంశాలపై ఆర్థో వైద్యులు, ఔషధ నియంత్రణ, ఆహార భద్రత, ట్రెజరీ, ఆడిట్‌ శాఖ అధికారులతో కలెక్టర్‌ కలిసి సమీక్షించనున్నా రు. కలెక్టరేట్‌లోనే మధ్యాహ్న భోజనంచేసి మధ్యా హ్నం 2.30గంటలకు హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరి వెళ్లనున్నారు. కాగా జిల్లా ఆసుపత్రికి డయాలసిస్‌ కేంద్రం మంజూరయినప్పటికీ ఏర్పాటుపై మాత్రం స్పష్టత రాలేదు. 


కడుపు కోతలో రాష్ట్రంలోనే అగ్రస్థానం ..

ప్రసవ శస్త్ర చికిత్సల్లో రోజుకు 21శస్త్ర చికిత్సలతో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో సిజేరియన్లు తగ్గించే లక్ష్యంతో మంత్రి జిల్లా వైద్యుల తో నిర్వహించనున్న సమీక్షా సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సిజేరియన్‌ ఆడిట్‌ను అమల్లోకి తేవడం, ప్రసవ శస్త్ర చికిత్సలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో జిల్లాలో కూడా నెలరోజులుగా సిజేరియన్ల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 32,056 ప్రసూతీలు జరగ్గా, వాటిలో 23,303 శస్త్రచికిత్సలే ఉండి కేవలం 8753 మాత్రమే సాధారణ కాన్పులు ఉండడం గమనార్హం. అయితే ప్రభుత్వ ఆసుపత్రు ల్లో 17,217 ప్రసవాలు చేయగా, 10,301 సిజేరియ న్లు, 6916 సాధారణ కాన్పులు ఉన్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 14,839 ప్రసవాలు చేయగా, వీటిలో 13,002 సిజేరియన్లు ఉండగా కేవలం 1837 మాత్ర మే సాధారణ ప్రసవాలు ఉండడం ప్రైవేట్‌ ఆసుపత్రుల వైఖరిని తేటతెల్లం చేస్తోంది.


అందుబాటులోకి రానున్న సేవలు 

మంత్రి హరీ్‌షరావు జిల్లా ఆసుపత్రి పర్యటన నేపథ్యంలో పలు వైద్య సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు ఎస్‌ఎన్‌సీయూ వార్డులో పూర్తిస్థాయి వైద్యసేవలు, 12 సంవత్సరాల్లోపు పిల్లలకు డీపీఐసీయూ వార్డుల్లో పూర్తిస్థాయి ఉచిత వైద్య సేవలు అందుబా టులోకి రానున్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జన్మించి న నవజాత శిశువులకు కూడా ఇక్కడ ఉచిత వైద్య సేవలు అందిస్తారు. అయితే ఆ రెండు వార్డుల నిర్వహణకు అవసరమైన 23మందితో  కూడిన వైద్యులు, సిబ్బంది నియామకాలపై ఇంకా స్పష్టతరాలేదు. ప్యాట్రన్‌ ప్రకారం నియామకాలు జరిగితేనే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. అలాగే రూ.కోటి25లక్షలతో చేపడుతున్న తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌ ద్వారా మరో ఐదు నెలల్లో 53కు పైగా రోగ నిర్థారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. 


సమస్యలకు నిలయం జిల్లా ఆసుపత్రి 

పేరుకు జిల్లా ఆసుపత్రి అయినా వైద్యసేవల్లో వెనుకంజలోనే ఉంది.వంద పడకల ఏరియా ఆసుపత్రిగా ఉన్న భువనగిరి ఆసుపత్రిని జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసినా పడకల సంఖ్య మాత్రం పెంచలేదు. అలా గే ప్యాట్రన్‌ ప్రకారం 43మంది వైద్య పోస్టుల మం జూరు ఉండగా, ప్రస్తుతం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సహా 26వైద్యుల పోస్టులు మాత్రమే భర్తీగా ఉండగా మిగతావన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో వైద్య చికిత్సలు, సేవలు అందక రోగులు ఇబ్బందు లు పడుతున్నారు. జిల్లా ఆసుపత్రి ఆవరణలో చిన్నగదిలో మార్చురీ రూం కొనసాగుతుండడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. మృతదేహాల తో దుర్గంధం వ్యాపించడంతోపాటు పోస్టుమార్టం తో ఉత్పత్తయ్యే రసాయన జలాలకు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ లేకపోవడంతో పరిసరాల పరిశుభ్రతకు ఆ టంకం కలుగుతోంది. అలాగే పార్కింగ్‌తోపాటు పలుసమస్యలు కూడా ఆసుపత్రిని వేధిస్తున్నాయి.  

Updated Date - 2022-05-20T05:41:15+05:30 IST