పది ఫలితాల్లో 98.44 శాతంతో జిల్లా బాలికల హవా

ABN , First Publish Date - 2022-07-01T06:34:57+05:30 IST

పది ఫలితాల్లో 97.73 శాతం ఉత్తీర్ణులై రాష్ట్రంలో జిల్లా 2వస్థానంలో నిలిచింది.

పది ఫలితాల్లో 98.44 శాతంతో జిల్లా బాలికల హవా
కేక్‌కట్‌ చేస్తున్న కలెక్టర్‌, అధికారులు

జిల్లాలో 97.73 శాతం మంది పాస్‌

ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 

జిల్లాకు రెండోస్థానంఫ కలెక్టరేట్‌లో విద్యాశాఖ సంబురాలు

జిల్లా విద్యాశాఖను అభినందిస్తూ మంత్రి ప్రకటన 

కేజీబీవీ స్కూళ్లలో 99.21 శాతం ఉత్తీర్ణత

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 30 : పది ఫలితాల్లో 97.73 శాతం ఉత్తీర్ణులై రాష్ట్రంలో జిల్లా 2వస్థానంలో నిలిచింది. మొత్తం 9,642 విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 9,423 మంది పాస్‌ మార్కులు సాధించారు. బాలురు 4,713 హాజరు కాగా 4,571 మంది 96.99 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 4,927కు గాను 4,852 పాసై 98.44 శాతం సాధించారు. జిల్లాలో బాలికలు ఫలితాల సాధనలో అగ్రగామిగా నిలిచారు.

సమష్టి కృషితో రెండోస్థానం : కలెక్టర్‌

పదిఫలితాలు గురువారం విడుదల కాగా జిల్లారాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలు వడంతో కలెక్టర్‌ కార్యాలయంలో విద్యాశాఖ సంబురాలు నిర్వహించుకున్నారు. కలె క్టర్‌కు స్వీట్లు తినిపించి సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫా రూఖీ మాట్లాడుతూ... సమష్టికృషితో ఇది సాధ్యమైందన్నారు. జిల్లాలోని 231 పాఠశాలలకు గాను 148 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించడం పట్ల అధికారులను అభినందించారు. 327 మంది 10 జీపీఏ సాధించారన్నారు. అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాంబాబు, డీఈవో రవీందర్‌రెడ్డి, పద్మ, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఫలితాలు : డీఈవో

పది ఫలితాల్లో జిల్లాలోని 93 ప్రభుత్వ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఫలితాలు విడుదలైన సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్ల డించారు. బాలురు 17 మంది, బాలికలు 53 మంది మొత్తం 70 మంది 10 పీజీఏ సాధించారన్నారు. 6,580 మంది హాజరు కాగా 6,387 మంది ఉత్తీర్ణులయ్యారు.  

జిల్లా రెండోస్థానంలో నిలువడం అభినందనీయం : మంత్రి

పదిఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో నిలువడం అభినందనీయమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం పది ఫలితాలు వెలువబడిన తరువాత స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో కొలువైన బాసర సరస్వతీ అమ్మవారి కరుణా కటాక్షాలతో ఇది సాధ్య మైందని పేర్కొన్నారు. ఈ ఫలితాల స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రథమస్థానంలో నిలిచేందుకు శ్రమించాలన్నారు. ఉపాధ్యాయుల ప్రత్యేకచొరవతో పాటు తల్లి దండ్రుల ప్రోత్సాహం ఇందుకు దోహదపడిందన్నారు. విద్యాశాఖ అధికారులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 

కేజీబీవీ స్కూళ్లలో 99.21 శాతం ఉత్తీర్ణత

జిల్లాలోని 18 కేజీబీవీ స్కూళ్లలో గురువారం విడు దలైన పదిలో 99.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 760 మంది విద్యార్థినులు హాజరు కాగా 754 మంది ఉత్తీర్ణులయ్యారు. 12 మంది 10 జీపీఏ సాధించగా 266 విద్యార్థులు 9 జీపీఏ సాధించిన వారిలో ఉన్నారు. 14 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణులయ్యారు. నర్సాపూర్‌(జి) స్కూల్‌కు చెందిన 7గురు 10 జీపీఏ, సోన్‌ విద్యార్థులు 46 మంది 9 జీపీఏ సాధించి జిల్లాలోని కేజీబీవీల్లో అగ్రగామిగా నిలిచారు. 

గురుకుల బాలికలు వందశాతం ఉత్తీర్ణత

సోఫీనగర్‌ గురుకుల పాఠశాల బాలికలు గురువారం వెలువడిన పది ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. 18 మంది బాలికలు జీపీఏ 10తో ఏ గ్రేడ్‌ సాధించగా 21 మంది జీపీఏ 9.8తో ఏ2 గ్రేడ్‌ సాధించారు. వంద శాతం ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్‌ గంగాశంకర్‌, ఉపన్యాసకుడు బి. వెంకట్‌ అభినందించారు. 

Updated Date - 2022-07-01T06:34:57+05:30 IST