అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి

ABN , First Publish Date - 2021-01-27T06:28:20+05:30 IST

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాం గం కృతనిశ్చయంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ ఉద్ఘాటించారు

అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి
పతాకావిష్కరణ చేసి వందనం సమర్పిస్తున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ

అందరి సహకారంతో ముందుకు 

కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

గణతంత్ర సందేశం

పోలీసుల కవాతు.. ఆరోగ్య సిబ్బందికి ప్రశంసాపత్రాలు

జిల్లా అంతటా 72వ రిపబ్లిక్‌ డే వేడుకలు

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాల నిర్వహణ

నిర్మల్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాం గం కృతనిశ్చయంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ ఉద్ఘాటించారు. మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్‌టీఆర్‌ మినీస్టేడియంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం కలెక్టర్‌ తన ప్రసంగంలో ప్రజలకు గణ తంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయ సహకారంతో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధి గ్రామా భివృద్ధితోనే సాధ్యమని అందుకనుగుణంగా ప్రణా ళికాబద్ధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పల్లెల సమగ్రాభివృద్ధి రూపురేఖలు మార్చుతూ ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో ము మ్మరంగా పారిశుధ్య పనులు మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలి పారు. కోవిడ్‌ - 19 మహమ్మారి నివారణ, నియంత్రణ సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని అ న్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి కంటో న్మెంట్‌ జోన్లు గుర్తించామని కోవిడ్‌ అనుమానిత లక్షణాలున్న వ్యక్తులను గుర్తించి పరీక్షలు జరి పామని, పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారికి తగిన వైద్య సేవలందించినట్లు వివరించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సేవలందించిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమన్నారు. దేశ వ్యా ప్తంగా కోవిడ్‌- 19 వ్యాధి నిరోధన టీకాల కార్య క్రమంలో భాగంగా ఈ నెల 16 నుండి మొదటి విడతగా ఫ్రంట్‌లైన్‌ వర్క ర్లు హెల్త్‌కేర్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ అందజేశా మన్నారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీస్‌ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలి పారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు విస్తృత ప్రాచుర్యం కల్పిస్తున్న ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా ప్రతినిధులు సమాచార శాఖ కళాకారులు, కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల కృషిని ప్రశం సించారు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జడ్పీ చైర్‌పర్సన్‌ కే.విజయలక్ష్మీ, మున్సిపల్‌ చైర్మన్‌ జి. ఈశ్వర్‌, అడిషనల్‌ ఎస్పీ ఏ. రాంరెడ్డి, ఇతర శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 

పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో కలెక్టర్‌ వారిని తిలకించి వందనం స్వీకరించారు.

నిరాడంబరంగా వేడుకలు

నిర్మల్‌ కల్చరల్‌ : జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలను నిరాడం బరంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ జాతీయ పతాకావిష్కరణ గావించారు. కోవిడ్‌ - 19 దృష్ట్యా ప్రభుత్వ శాఖల స్టాల్స్‌, శకటాల ప్రదర్శన ఏర్పాటు చేయలేదు. 

పోలీసుల కవాతు నిర్వహణ

గణతంత్ర వేడుకల సందర్భం గా ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ నిర్వహించారు. సాయుధ పోలీస్‌ లతో పాటు ఎన్‌సీ సీ, ఇతర పోలీస్‌ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్‌ శాఖ గౌరవ వందనాన్ని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ స్వీకరించారు. పోలీసుల కవాతును ఆహుతులు తిలకించారు. అడిషసల్‌ ఎస్పీ రాంరెడ్డి, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐలు శ్రీనివాస్‌, జీవన్‌రెడ్డి, వెంకటేష్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

జిల్లాలో గణతంత్ర వేడుకలు

 72వ గణతంత్ర దినోత్సవం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వ హించారు. నిర్మల్‌ జిల్లా పోలీస్‌ కార్యా లయంలో 72వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. అడిషల్‌ ఎస్పీ రాంరెడ్డి పతాకా విష్కరణ చేశారు. ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో సాయుధదళ కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో ఏఎస్పీ పాల్గొన్నారు. డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, సీఐలు శ్రీనివాస్‌, జీవన్‌రెడ్డి, వెంకటేష్‌ ఎస్‌బీఐ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

కలెక్టర్‌ కార్యాలయంలో..

నిర్మల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో ఆర్‌వో రమేష్‌ రాథోడ్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-27T06:28:20+05:30 IST