కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టులు

ABN , First Publish Date - 2022-05-20T05:03:22+05:30 IST

పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం కొత్తగా ఏర్పడిన

కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టులు
మండల పరిషత్‌ పాత సమావేశ భవనాన్ని పరిశీలిస్తున్న జిల్లా జడ్జి

  • జిల్లా న్యాయమూర్తి హరికృష్ణ భూపతి 


ఆమనగల్లు / కడ్తాల్‌ మే 19 : పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటుకు న్యాయ శాఖ కార్యాచరణ రూపొందిస్తుందని జిల్లా న్యాయమూర్తి సీహెచ్‌.హరికృష్ణ భూపతి తెలిపారు. దీనిలోభాగంగా కల్వకుర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు పరిధిలో కొనసాగుతున్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు కలిపి ఆమనగల్లులో నూతనంగా జూనియర్‌ సివిల్‌ జడ్జి, మెట్రోపాలిటిన్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు పట్టణంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటుకు గురువారం తహసీల్దార్‌ పాండు నాయక్‌, సీఐ ఉపేందర్‌, ఎంపీడీవో వెంకట్రాములు, ఆర్‌అండ్‌బీ డీఈ అర్జున, ఎంపీపీ అనితవిజయ్‌, జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌ లతో కలిసి జిల్లా జడ్జి సిహెచ్‌ హరికృష్ణ భూపతి భవనాలను పరిశీలించారు. మండల పరిషత్‌ పాత సమావేశ భవనంలో కోర్టుహాల్‌, ఎక్సైజ్‌ కార్యాలయం, ఓల్డ్‌ క్వార్టర్స్‌ సిబ్బంది, రికార్డుల, న్యాయవాదుల కోసం గుర్తించి వాటి ఆధునికీకరణ, మరమ్మతులు, వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని ఆర్‌అండ్‌బీ డీఈ అర్జున, ఏఈ రవితేజను జడ్జి భూపతి ఆదేశించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా జడ్జి హరికృష్ణభూపతి విలేఖరులతో మాట్లాడుతూ జూన్‌ 2వ తేది వరకు ఆమనగల్లులో కోర్టు ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాల్లో భాగంగా వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో కూడ జిల్లా కోర్టుల ఏర్పాటుకు భవనాలు పరిశీలిస్తున్నట్లు జిల్లా జడ్జి భూపతి తెలిపారు. రాజేంద్రనగర్‌లో కూడ అదనపు కోర్టు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ధర్మేశ్‌,మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ తోట గిరియాదవ్‌, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు పత్యనాయక్‌, ఎంపీటీసీ దోనాదుల కుమార్‌, కౌన్సిలర్లు సోనిజయరామ్‌, రాధమ్మవెంకటయ్య, చేనేత సంఘం అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్‌, బార్‌ అసోసియేషన్‌ సభ్యుడు దుడ్డు ఆంజనేయులు, లక్ష్మీనర్సింహారెడ్డి, మల్లేశ్‌, రామకృష్ణ, శివ, రూపం వెంకట్‌రెడ్డి, సుండూరు శేఖర్‌, శ్రీకాంత్‌ సింగ్‌, రమేశ్‌నాయక్‌, నరేందర్‌, వెంకటేశ్‌, భాస్కర్‌, సయ్యద్‌ ఖలీల్‌, గుత్తి బాలస్వామి పాల్గొన్నారు. 

కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని జిల్లా జడ్జి సీహెచ్‌కే భూపతి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తొలిసారిగా ఆలయానికి వచ్చిన జిల్లా జడ్జికి ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ రామావత్‌ సిరోలిపంతూ, ఈవో స్నేహలత, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. 

ఆమనగల్లు పట్టణంలో గురువారం కోర్టు ఏర్పాటుకు భవనాల పరిశీలనకు వచ్చిన జిల్లా జడ్జి సిహెచ్‌కే భూపతిని జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌ మర్యాద పూర్వంగా కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. 



Updated Date - 2022-05-20T05:03:22+05:30 IST