కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , First Publish Date - 2020-08-08T07:44:07+05:30 IST

కింగ్‌జార్జ్‌ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన బ్లాక్‌లో కొవిడ్‌ వైరస్‌ బాధితులకు అత్యుత్తమ ..

కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

 జిల్లా కలెక్టర్‌ వి. వినయ్‌ చంద్‌


విశాఖపట్నం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): కింగ్‌జార్జ్‌ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన బ్లాక్‌లో కొవిడ్‌ వైరస్‌ బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం భవన సముదాయాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలు అందించడంలో పాటించాల్సిన విధి విధానాలు, అంబులెన్స్‌ల రాకపోకలు సంబంధిత విషయాలపై పలు సూచనలు చేశారు. కొవిడ్‌ రోగి రాగానే వారి వివరాలను సత్వరమే నమోదు చేసుకుని, డాక్టర్‌ పరిశీలించి బెడ్‌ కేటాయించాలన్నారు.


టాయిలెట్స్‌, సెక్యూరిటీ, శానిటేషన్‌, భోజనాల ఏర్పాటు, ఫ్లోర్‌ మేనేజర్‌, అవసరమైన సిబ్బంది నియమించడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రిసెప్షన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు అలర్ట్‌గా ఉంటూ సేవలు అందించాలని, మూడు షిఫ్టుల్లో అన్ని రకాల సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వైద్యాధికారులతో కలిసి అన్ని ఫ్లోర్‌లు పరిశీలించారు. 

Updated Date - 2020-08-08T07:44:07+05:30 IST