‘సారూ... ఈ నోట్లు మార్చివ్వరూ...!’

ABN , First Publish Date - 2022-04-19T16:35:07+05:30 IST

తాను దాచుకున్న పాత నోట్లు చెల్లవని చుట్టుపక్కల వారు తెలిపారని, వాటిని మార్చి ఇవ్వాలంటూ ఓ వృద్ధురాలు కలెక్టర్‌ను కోరింది. కరూర్‌ జిల్లా నందన్‌కోట గ్రామానికి

‘సారూ... ఈ నోట్లు మార్చివ్వరూ...!’

                          - కలెక్టర్‌కు వృద్ధురాలి వేడుకోలు


పెరంబూర్‌(చెన్నై): తాను దాచుకున్న పాత నోట్లు చెల్లవని చుట్టుపక్కల వారు తెలిపారని, వాటిని మార్చి ఇవ్వాలంటూ ఓ వృద్ధురాలు కలెక్టర్‌ను కోరింది. కరూర్‌ జిల్లా నందన్‌కోట గ్రామానికి చెందిన చిన్నపిల్లై (80) భర్త రామజయం కొన్నేళ్ల క్రితం మృతిచెందడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె బధిరురాలు కావడంతో ప్రభుత్వం నెలకు రూ.1,000 ఆర్ధికసాయం అందజేస్తోంది. ఆ డబ్బులో తన ఖర్చులకు పోను మిగతా సొమ్మును పొదుపుచేసుకొనేది. అలా పలు ఏళ్లుగా రూ.20 వేల విలువైన పాత రూ.100, రూ.1,000 నోట్లను దాచుకుంది. ఇటీవల ఆ నోట్లు మార్చే సమయంలో, ఈ నోట్లు రద్దయ్యాయని, చెల్లవని చిన్నపిల్లై తెలుసుకుంది. దీంతో, సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌కు వెళ్లిన చిన్నపిలై కలెక్టర్‌ను కలుసుకొని, పాత నోట్లు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై విచారించి న్యాయం చేస్తానని కలెక్టర్‌ ప్రభుశంకర్‌ వృద్ధురాలికి హామీ ఇచ్చారు.

Updated Date - 2022-04-19T16:35:07+05:30 IST