గిరిజనుల అభివృద్ధికి ప్రణాళిక

ABN , First Publish Date - 2020-08-10T11:11:50+05:30 IST

పశ్చిమ ఏజెన్సీలోని గిరిజన తెగల అభివృద్ధికి పరిరక్షణాభివృద్ధి ప్రణాళిక (సీసీడీపీ) అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌,ఐటీడీఏ చైర్మన్‌ ..

గిరిజనుల అభివృద్ధికి ప్రణాళిక

జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ చైర్మన్‌ ముత్యాలరాజు


బుట్టాయగూడెం, ఆగస్టు 9 : పశ్చిమ ఏజెన్సీలోని గిరిజన తెగల అభివృద్ధికి పరిరక్షణాభివృద్ధి ప్రణాళిక (సీసీడీపీ) అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌,ఐటీడీఏ చైర్మన్‌ రేవు ముత్యాలరాజు తెలిపారు. 2020-21 సంవత్సరంలో గిరిజన ప్రాంతాల్లో రూ.114.50 లక్షలతో 113 అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.  కేఆర్‌ పురం ఐటీడీఏ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో కలెక్టర్‌ పాల్గొని ఆదివాసీ, జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆదివాసీ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌కు ఆదివాసీలు గిరిజన సంప్రదాయంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏజెన్సీ ఐదు మండలాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకంలో రూ.4055.20 లక్షలతో చేపట్టిన 36 బీటీ రోడ్లు పనులు పూర్తి కావస్తున్నట్లు తెలిపారు. నాడు-నేడులో రూ.1132.52 లక్షలతో ఏజెన్సీలోని 61 పాఠశాలలను అభివృద్ధి పరు స్తున్నట్లు తెలిపారు. ఆక్టోబర్‌ 2వ తేదీన 779 మంది గిరిజన లబ్ధిదారులకు  1352.83 ఎకరాల పోడు భూములకు పట్టాలు, 12361 ఎకరాలకు కమ్యూనిటీ పట్టాలు అందజేస్తామన్నారు.


వ్యాధులను అరికట్టడానికి, సత్వర సేవలకోసం ఐటీడీఏలో ట్రైబల్‌ హెల్త్‌ డెస్క్‌  ఏర్పాటు చేశామని 94411 63128 నెంబర్‌లో సంప్రదించి సహాయం పొందవచ్చన్నారు. గిరిజనులకు అత్యాధునిక వైద్యసేవలందించడం కోసం ఏజెన్సీలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్‌ నిర్మాణానికి 10.80 ఎకరాల భూమిని సేకరించామన్నారు. ఐటీడీఏ పరిధిలో గల 11 ఆరోగ్య ఉప కేంద్రాలను 27.6 లక్షలతో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చి టెలి మెడిషన్‌ అందిస్తున్నట్లు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో 45 విలేజ్‌ హెల్త్‌ క్లిని క్‌లను నిర్మిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఐటీడీఏ పీవో ఆర్‌వీ సూర్యనారాయణ, ఆర్డీవో ప్రసన్నలక్ష్మీ, డీఎస్పీ వెంకటేశ్వరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T11:11:50+05:30 IST