జిల్లా కేంద్రం సాధనకు ఉద్యమం

ABN , First Publish Date - 2022-01-29T05:38:19+05:30 IST

జిల్లాకేంద్రంగా హిందూపురాన్ని ప్రకటించకపోవడంపై పోరాట ఉద్యమంపైకి లేచింది. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్య తిరేకిస్తూ జిల్లా కేంద్రం సాధనకై హిందూపురంలో టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఐ, బీఎస్పీ, ఎంఐఎంతోపాటు కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తున్నాయి.

జిల్లా కేంద్రం సాధనకు ఉద్యమం
బంద్‌కు పిలుపునిస్తూ పోస్టర్లు విడుదల చేస్తున్న అఖిలపక్షం నాయకులు

నేడు హిందూపురం బంద్‌ 

హిందూపురం, జనవరి 28: జిల్లాకేంద్రంగా హిందూపురాన్ని ప్రకటించకపోవడంపై పోరాట ఉద్యమంపైకి లేచింది. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్య తిరేకిస్తూ జిల్లా కేంద్రం సాధనకై హిందూపురంలో టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఐ, బీఎస్పీ, ఎంఐఎంతోపాటు కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా అఖిలపక్షం శనివారం హిందూపురం బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యం లో పట్టణంలోని కనకదాస కల్యాణమండపంలో సమావేశమై ఉద్యమ  పోరాటాన్ని తీర్మానించారు. అనంతరం బైక్‌ర్యాలీ నిర్వహించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్‌ నియోజకవర్గ కేం ద్రంగా ఉన్న హిందూపురాన్ని కాదని పుట్టపర్తిని జిల్లాకేంద్రంగా ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. జిల్లా కేంద్రం సాధన ఉద్యమానికి రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు, న్యా య వాదులు, జిల్లా కేంద్ర సాధన సమితి మద్దతు ఇచ్చారు. సోమవారం మున్సిపాల్టీలో టీడీపీ, బీ జేపీ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా ధిక్కార స్వరం వినిపించారు. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న హిందూపురాన్నే జిల్లాకేంద్రంగా ప్రకటించాలని ప్ర భుత్వం దృష్టికి తీసుకెళతామని హిందూపురం మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ, వైస్‌ చైర్మెన్లు బలరామిరెడ్డి, జబీవుల్లాతోపాటు మున్సిపల్‌ కౌన్సిలర్లు వెల్లడించారు. హిం దూపురం జిల్లా కేంద్రం సాధనకు పదవులను త్యాగం చేయడానికైనా సిద్ధమన్నారు. శనివారం హిందూపురం బంద్‌కు అఖిలపక్షం పిలుపుతో జిల్లాకేంద్రం సాధన అంశం వేడెక్కింది. శుక్రవారం నిర్వహించిన బైక్‌ర్యాలీలో అఖిలపక్షం నాయకులు టీడీపీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అం బికా లక్ష్మీనారాయణ, బాలాజీ మనోహర్‌, రమే్‌షరెడ్డి, ఆకుల ఉమేష్‌, చలపతి, చారుకీర్తి, ఉమర్‌ ఫారూక్‌, గంగిరెడ్డి, కౌన్సిలర్లు సతీ్‌షకుమార్‌, రాఘవేంద్ర, దుర్గాపవీన, ఆదినా రాయణ, అమర్‌నాథ్‌, పరిమళ, పా ర్వతమ్మ, విజయలక్ష్మి, అశ్వత్థనారాయణరె డ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T05:38:19+05:30 IST