ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిల్లా వెనుకబాటు

ABN , First Publish Date - 2021-07-31T05:22:18+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సిక్కోలు వెనుక బాటుకు గురవుతోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు ఆరోపించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం లో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని వనరులు ఉన్నా.. సీఎం జగన్‌ నిర్లక్ష్యం కారణంగా సద్వినియోగం కాక అభి వృద్ధి చెందడం లేదని విమర్శించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిల్లా వెనుకబాటు
మాట్లాడుతున్న కళా వెంకటరావు


 టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు

రాజాం, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సిక్కోలు వెనుక బాటుకు గురవుతోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు ఆరోపించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం లో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని వనరులు ఉన్నా.. సీఎం జగన్‌ నిర్లక్ష్యం కారణంగా సద్వినియోగం కాక అభి వృద్ధి చెందడం లేదని విమర్శించారు. సువిశాల సుముద్ర తీరం ఉన్నా, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మా ణం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరు కారణంగా ఉత్తరాంధ్రకు కొత్త పరిశ్రమలు రావడం లేదన్నారు. రెండేళ్ల వైసీపీ పాలనలో.. అభివృద్ధి పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని మండిపడ్డారు. సాగునీరు, తాగు నీరు, పరిశ్రమలు, విద్య, ఉపాధి ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కుంటుపడిందని ఆవే దన వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు డ్రామాలు ఆడుతు న్నారు తప్ప.. కేంద్రాన్ని నిలదీసే స్థితిలో లేరని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించకపోతే ప్రజలు తిరగబడి పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు టంకాల వెంకటేష్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

 


Updated Date - 2021-07-31T05:22:18+05:30 IST