రేపు అథ్లెటిక్స్‌ బాలబాలికల ఎంపికలు

ABN , First Publish Date - 2021-01-16T05:43:00+05:30 IST

జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్‌లోని వివిధ ఈవెంట్స్‌లో జిల్లాస్థాయిలో బాలబాలికల ఎంపికలు ఆదివారం జరుగుతాయని ఆ అసోసియేషన్‌ కార్యదర్శి అరిగెల విజయ్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రేపు అథ్లెటిక్స్‌ బాలబాలికల ఎంపికలు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జనవరి 15: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్‌లోని వివిధ ఈవెంట్స్‌లో  జిల్లాస్థాయిలో బాలబాలికల ఎంపికలు ఆదివారం జరుగుతాయని ఆ అసోసియేషన్‌ కార్యదర్శి అరిగెల విజయ్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎంపికలు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతాయన్నా రు. అండర్‌-14 విభాగంలో పాల్గొనే బాలబాలికలు 2007 ఫిబ్రవరి 11 నుంచి 2009 ఫిబ్రవరి 10వ తేదీ మధ్య జన్మించి ఉండాలని, అండర్‌-16 విభాగానికి 2005 ఫిబ్రవరి 11 నుంచి 2007 ఫిబ్రవరి 10 మధ్య, అండర్‌-18లో పాల్గొనే వారు  2003 ఫిబ్రవరి 11 నుంచి 2005 ఫిబ్రవరి 10వ తేదీలోపు, అండర్‌-20 వారు 2001 ఫిబ్రవరి 11 నుంచి 2003 ఫిబ్రవరి 10 మధ్య పుట్టి ఉండాలన్నారు. ఈ ఎంపికలు  ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్న బాలబాలికలు వయసు ధ్రువీకరణ, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టుసైజు ఫొటో హాజరుకావాలన్నారు. అయితే ఒక్కొక్కరికి రెండు ఈవెంట్లలో మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి విరరాలకు 9441875190,9701798480 నెంబర్లను సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2021-01-16T05:43:00+05:30 IST