జిల్లా ఒలంపిక్‌ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

ABN , First Publish Date - 2022-07-04T05:23:51+05:30 IST

జిల్లా ఒలంపిక్‌ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

జిల్లా ఒలంపిక్‌ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం
జిల్లా ఒలంపిక్‌ సంఘం నూతన కార్యవర్గం

- స్పోర్ట్స్‌ డే ఆగస్టు 29న వివిధ క్రీడాపోటీల నిర్వహణ 

- నూతన కార్యవర్గం నిర్ణయం 

తిరుపతి(కొర్లగుంట), జూలై 3: తిరుపతి జిల్లా ఒలంపిక్‌ సంఘం నూతన కార్యవర్గం ఏకగీవ్రంగా ఎంపికైంది. ఆదివారం స్థానిక యూత్‌ హాస్టల్‌ వేదికగా రిటర్నింగ్‌ అధికారి బి.మునిబాబు (అడ్వొకేట్‌), వీరరాఘవరెడ్డి(ఏపీ సాప్‌ బోర్డు మెంబర్‌)ల సమక్షంలో సంఘం ఎంపిక పారదర్శకంగా జరిగింది. ఈ మేరకు జిల్లా ఒలంపిక్‌ సంఘం ప్రెసిడెంట్‌గా ఎస్‌.అంజనేయులనాయుడు, చైర్మన్‌గా జల్లి మధుసూదన్‌లను నియమించారు. ప్రధాన కార్యదర్శిగా ఎం.సురేంద్రరెడ్డి, ట్రెజర్‌గా వెంకటేశ్వరమ్మ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా జగదీశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌రెడ్డి, ఇందుమతి, గోపి, సంయుక్త కార్యదర్శులుగా షణ్ముగం, ధనంజయులు, మురళి, ఈసీ సభ్యులుగా 8మందిని, అసోసియేట్‌ సభ్యులుగా ఏడుగురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ క్రీడల దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 29న జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రాధాన్యత క్రీడాపోటీలను నిర్వహించడానికి ఆ సంఘం తొలి నిర్ణయం తీసుకుంది. అనంతరం  సంఘం చీఫ్‌పాట్రన్లగా మబ్బుదేవ నారాయణరెడ్డి, ఆనందరెడ్డి, వీరరాఘవరెడ్డి, ఎం.వీ.ఎస్‌.మణిలను ఎంపిక చేసుకుంది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్‌ ఆంజనేయులనాయుడు, చైర్మన్‌ మధుసూదన్‌ మాట్లాడుతూ ఖేలో ఇండియా సెంటర్‌ను తిరుపతి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. తిరుపతిని క్రీడా హబ్‌గా రూపొందించాలని మబ్బు దేవనారాయణరెడ్డి ప్రతిపాదించగా ప్రభుత్వం తరపున తన వంతు కృషి చేస్తానని సాప్‌ బోర్డు మెంబర్‌ వీరరాఘవరెడ్డి హామీనిచ్చారు.  నగరంలో అనేక క్రీడాంశాలను నిర్వహించి పూర్వవైభవం తీసుకొస్తామని ఎంవీఎస్‌ మణి తెలియజేశారు. నూతన స్టేడియం నిర్మించడానికి కృషి చేస్తామని రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనందరెడ్డి పేర్కొన్నారు. 

 

Updated Date - 2022-07-04T05:23:51+05:30 IST