Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 15 Aug 2022 15:14:49 IST

Laal Singh Chaddha Failure: నాదే బాధ్యత అంటున్న ఆమిర్ ఖాన్.. పరిహారం ఇవ్వాల్సిందేనంటున్న డిస్ట్రిబ్యూటర్స్..!

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Lal Singh Chaddha). టామ్ హ్యాంక్స్ నటించిన ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు నిర్మించారు. వయాకాం పిక్చర్స్‌తో కలసి ఆమిర్ ఖాన్ రూ. 180కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలైంది. మూవీపై ప్రేక్షకులు ఏ మాత్రం ఆసక్తి చూపడంతో బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.  


‘లాల్ సింగ్ చడ్డా’ వసూళ్లను రాబట్టలేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. తమకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. అందుకు మేకర్స్ కూడా అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే నష్ట పరిహారాన్ని చెల్లించబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆమిర్ చివరగా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లో నటించాడు. నాలుగేళ్ల క్రితం ఈ చిత్రం విడుదలైంది. కొంచెం విరామం అనంతరం ‘లాల్ సింగ్ చడ్డా’ తో రావడంతో భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. కానీ, ఆ అంచనాలను ఈ చిత్రం అందు‌కోలేకపోయింది. సినిమా విడుదలై నాలుగు రోజులైనప్పటికీ రూ. 45కోట్ల వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. అతుల్ కులకర్ణి స్క్రీన్ ప్లేను అందించాడు. హీరో నాగచైతన్య ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement