డిస్ట్రిబ్యూటర్‌ కాల్వ పనులను పూర్తి చేయిస్తా

ABN , First Publish Date - 2021-11-27T04:59:40+05:30 IST

పెండింగ్‌లో ఉన్న కేఎల్‌ఐ కాల్వ పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపడతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి తెలిపారు.

డిస్ట్రిబ్యూటర్‌ కాల్వ పనులను పూర్తి చేయిస్తా
జడ్చర్లలో పందుల పెంపకందారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి


మిడ్జిల్‌, నవంబరు 26 : పెండింగ్‌లో ఉన్న కేఎల్‌ఐ కాల్వ పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపడతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని వాడ్యాల గ్రామంలోని పార్టీ కార్యకర్త ఉదయ్‌కుమార్‌ కుమారుడి జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. అనంతరం వెలుగొమ్ముల గ్రామంలో ఇటీవల గృహ ప్రవేశం నిర్వహించిన సాయిలు, సురేష్‌గౌడ్‌, నరేష్‌గౌడ్‌ల ఇళ్లకు వెళ్లి అభినందించారు. పార్టీ కార్యకర్త కుపిరెడ్డి లక్ష్మారెడ్డి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించారు. అదే గ్రామంలో ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్తలు వెంకటయ్యగౌడ్‌, భీంరాజు, బాబు కుటుంబ సభ్యులను లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వెలుగొమ్ముల గ్రామంలోని రైతులు కేఎల్‌ఐ కాల్వ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యేను కోరగా, స్పందించిన ఆయన అక్కడి నుంచే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శ్యామల్‌రెడ్డి, జిల్లా నాయకులు బాల్‌రెడ్డి, సత్యంగుప్తా, సుదర్శన్‌, బంగారు, నర్సింహారెడ్డి, నాగిరెడ్డి, విజయ్‌, మన్యం, సాయిలు, రఘుపతిరెడ్డి, లచ్చిరెడ్డి, సత్యంగౌడ్‌, రాములు, సురేష్‌, కార్యకర్తలు ఉన్నారు.


పందులను తరలించాలి 


జడ్చర్ల, నవంబరు 26 : జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలో పందులను ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించాల్సిందేనని, ఉపేక్షించేదిలేదంటూ జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి హెచ్చరించారు. జడ్చర్లలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పందుల పెంపకందారులతో మాట్లాడారు. పట్టణంలో పందుల బెడ దతో ప్రజలు తీవ్ర ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయ ని పేర్కొన్నారు. పెంపకందారులు ఉపాధికి అన్ని విధాలుగా సహాయ, సహకా రాలు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మీరవీందర్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, నందకిశోర్‌, చైతన్యచౌహాన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. 

Updated Date - 2021-11-27T04:59:40+05:30 IST