Abn logo
Aug 4 2021 @ 00:19AM

దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల పంపిణీ

అధికారులకు గుర్తింపుకార్డులు అందిస్తున్న ఉదయమోహన్‌రెడ్డి

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 3: మదనపల్లె డివిజన్‌లోని 3,183 మంది దివ్యాంగులకు యూడీఐడీ(శాశ్వత జాతీయ గుర్తింపు) కార్డులు పంపిణీ చేసినట్లు వెలుగు ప్రత్యేక పాఠశాల కార్యదర్శి ఉదయమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అమ్మచెరువుమిట్ట సమీపంలో ఉన్న వెలుగు ప్రత్యేక పాఠశాలలో 15 మండలాల దివ్యాంగులకు యూడీఐడీ కార్డులను పంపిణీ చేశారు.  వికలాంగుల సంక్షేమశాఖ కార్యాలయం నుంచి వచ్చిన గుర్తింపుకార్డులను ఆయా మండలాల సంక్షేమ శాఖ సబ్బంది, గ్రామ వలంటీర్ల ద్వారా దివ్యాంగుల ఇళ్లకు పంపుతున్నామన్నారు. కావున దివ్యాంగులు వారి గుర్తింపు కార్డులను వలంటీర్లను అడిగి తీసుకోవాలని ఉదయ్‌మోహన్‌రెడ్డి కోరారు.