పేదలకు చీరలు పంపిణీ

ABN , First Publish Date - 2021-01-16T05:26:39+05:30 IST

సంక్రాం తి పండుగ సందర్భంగా రాజంపేట మండలంలో పలు చోట్ల ఆయా గ్రామ నాయకులు పేదలకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు.

పేదలకు చీరలు పంపిణీ
చీరలు పంపిణీ చేస్తున్న మాజీ ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి

రాజంపేట, జనవరి 15 : సంక్రాం తి పండుగ సందర్భంగా రాజంపేట మండలంలో పలు చోట్ల ఆయా గ్రామ నాయకులు పేదలకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి, ఆయన సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆకేపాడు చుట్టుపక్కల గ్రామాల్లో వేలా ది మందికి దుస్తులు పంపిణీ చేసి, విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అదే గ్రామంలో ఆకేపాటి గోపాల్‌రెడ్డి ఫౌండేషన్‌ ట్రస్ట్‌ తరపున మాజీ మండలాధ్యక్షులు ఆకేపాటి రంగారెడ్డి, ఆయన సోదరుడు ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేసి, విందు భోజనం ఏర్పాటు చేశారు. తాళ్లపాక గ్రామంలో మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ యోగీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో తాళ్లపాక చుట్టుపక్కల గ్రామస్తులకు చీరలు పంపిణీ చేశారు. మందరం గ్రామంలో మాజీ సర్పంచ్‌, వైసీపీ నేత తంబెళ్ల వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పోలి గ్రామంలో మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ పోలి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గాలివారిపల్లెలో రోటరీక్లబ్‌ ఆఫ్‌ అన్నమయ్య ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి, క్లబ్‌ సభ్యులు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కాగా  రాజంపేట పట్టణంలోని గడ్డివీధిలోని పేదలకు చిట్టే భాస్కర్‌ ఆధ్వర్యంలో సీఐ చంద్రశేఖ ర్‌రెడ్డి చేతుల మీదుగా 300మంది పేదలకు బట్టలు పంపిణీ చేశారు. 

పుల్లంపేటలో.... : మండల పరిధిలోని అనంతసముద్రం పంచాయతీ పెద్దూరు గ్రామంలో  గురువారం మాజీ ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి పేదలకు చీరలు పంపిణీ చేశారు. తన తల్లిదండ్రులు ముద్దా సుబ్బారెడ్డి, మనోరంజనమ్మల జ్ఞాపకార్ధం మహిళలకు చీరలు, పురుషులకు టవళ్లు, పంచెలు పంపిణీ చేశారు. 


Updated Date - 2021-01-16T05:26:39+05:30 IST