మహిళలను గౌరవించేందుకే చీరల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-24T05:41:22+05:30 IST

మహిళలను గౌరవించేందుకే చీరల పంపిణీ

మహిళలను గౌరవించేందుకే చీరల పంపిణీ
అల్లాపూర్‌లో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజుగౌడ్‌

తాండూరు రూరల్‌/యాలాల/బషీరాబాద్‌, సెప్టెంబరు 23 : ఆడపడుచులను గౌరవించేందుకే రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలం అల్లాపూర్‌, యాలాల మండల కేంద్రంతోపాటు సంగెంఖుర్దు, చెన్నారం, పగిడిపల్లి గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత కార్మికులకు చేయూతనిచ్చి.. వారు తయారు చేస్తున్న 12 రకాల చీరలను ఆడపడుచులకు పంపిణీ చేస్తూ వారి ముఖాల్లో ఆనందాన్ని నింపుతున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ రాజుగౌడ్‌ మాట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌తోపాటు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. సర్పంచ్‌ నందిని, ఎంపీటీసీ సాయిరెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు రాములు, జినుగుర్తి రామలింగేశ్వరాలయం అధ్యక్షుడు ప్రవీణ్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ చెన్నప్ప, టీఆర్‌ఎస్‌ నాయకులు బీరప్ప, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు రామ్‌లింగారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాందాస్‌, మాజీ వైస్‌ఎంపీపీ శేఖర్‌, ఆర్‌ఐ రాజిరెడ్డి, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, వైస్‌ఎంపీపీ రమేష్‌, సర్పంచ్‌ సిద్రాల సులోచన, తాండూరు మార్కెట్‌కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, యాలాల పీఏసీఎస్‌ వైస్‌చైర ్మన్‌ రాములు, అనంతయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలున్నారు. బషీరాబాద్‌ మండలం మంతట్టికి చెందిన మొగులప్పకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రూ.లక్ష విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేశారు. ఇందర్‌చెడ్‌ నర్సిరెడ్డి, దామర్‌చెడ్‌ సర్పంచ్‌ నర్సిరెడ్డి, పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T05:41:22+05:30 IST