సమగ్రాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-27T04:21:27+05:30 IST

సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

సమగ్రాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సరిత

- జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- అన్ని వర్గాలకు సమాన న్యాయం  : ఎమ్మెల్మే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- లబ్ధిదారులకు రేషన్‌ కార్డుల పంపిణీ

గద్వాల టౌన్‌, జూలై 26 : సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తూ సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్మే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. గద్వాల పట్టణంలోని ప్యారడైజ్‌ ఫంక్షన్‌ హాలులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల నియోజ కవర్గంలో 1,224 మందికి రేషన్‌ కార్డులు మంజూ రయ్యాయన్నారు. పట్టణంలో 122 మంది లబ్ధిదారు లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. కార్యక్ర మంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, ఉమ్మడి జిల్లా డీసీసీ బ్యాంకు డైరెక్టర్‌ ఎం.ఏ.సుభాన్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు, జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ సతీష్‌, ఆర్డీఓ రాములు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T04:21:27+05:30 IST