మాస్కుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-21T05:04:12+05:30 IST

వీడియో, ఫోటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులకు గురువారం బ్లడ్‌ 2 లివ్‌ పవన్‌ మాస్కులు అందజేశారు.

మాస్కుల పంపిణీ

కడప(సెవెన్‌రోడ్స్‌), జనవరి 20 : వీడియో, ఫోటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులకు గురువారం బ్లడ్‌ 2 లివ్‌ పవన్‌ మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికెళ్లేందు ఈ కరోనా విపత్తులో సైతం ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడుతున్న కడప వీడియో, ఫోటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులు అభినందనీయులన్నారు. గురువారం నాగరాజుపేటలో ఉన్న కడప హౌస్‌లో 30 మంది వీడియో, ఫోటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులకు మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వీడియో, ఫోటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిరుకూరు శ్రీనివాసులు, ఏఐటీయూసీ డిప్యూటి జిల్లా సెక్రటరీ బాదుల్లా, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మళ్లిఖార్జునరెడ్డి, నగర కార్యదర్శి మద్దిలేటి, ఆర్‌ఎ్‌సఎఫ్‌ భాస్కర్‌, లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T05:04:12+05:30 IST